• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Porn Racket: సంచలన విషయాలు బయటపెట్టిన కామసూత్ర నటి షెర్లిన్ చోప్రా-రాజ్‌కుంద్రా ఎలా తప్పుదోవ పట్టించాడంటే

|

ప్రముఖ వ్యాపారవేత్త,సినీ ఫైనాన్షియర్,హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నటి,కామసూత్ర 3డీ ఫేమ్ షెర్లిన్ చోప్రా పోర్న్ రాకెట్‌పై పలు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. రాజ్‌కుంద్రా తనను తప్పుదోవ పట్టించి పోర్న్ చిత్రాల్లో నటించేలా చేశారని ఆరోపించారు. గ్లామరస్ వీడియోలని చెప్పి తనతో అగ్రిమెంట్ చేయించుకుని... ఆపై బోల్డ్ చిత్రాల్లో నటింపజేశారని ఆరోపించారు. అంతేకాదు,ఆ వీడియోలు శిల్పాశెట్టికి నచ్చాయని... పోర్న్ వీడియోలు చేయడంలో తప్పేమీ లేదని తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా పోర్న్ రాకెట్‌పై స్పందించారు.

Raj Kundra Arrest : శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాలో మరో కోణం-పోర్న్ చిత్రాలు-పక్కా ఆధారాలతో అరెస్ట్Raj Kundra Arrest : శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాలో మరో కోణం-పోర్న్ చిత్రాలు-పక్కా ఆధారాలతో అరెస్ట్

Porn Racket: పోర్న్ కాంట్రాక్ట్ కాపీ లీక్... అశ్లీల చిత్రాల్లో నటీనటుల అంగీకారం కోసం...Porn Racket: పోర్న్ కాంట్రాక్ట్ కాపీ లీక్... అశ్లీల చిత్రాల్లో నటీనటుల అంగీకారం కోసం...

ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు : షెర్లిన్ చోప్రా

ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు : షెర్లిన్ చోప్రా

పోర్న్ రాకెట్‌ కేసులో షెర్లిన్ చోప్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం(అగస్టు 6) 8గంటల పాటు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం ప్రముఖ జాతీయ మీడియాకు షెర్లిన్ చోప్రా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పోర్న్ రాకెట్‌లోకి తానెలా ఎంటర్ అయింది... తననెలా నమ్మించి,మభ్యపెట్టి,ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడేసింది వివరించారు. 'ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఇలాంటి ఒక స్కాండల్‌లో ఇరుక్కుని ఇలా పోలీసుల ముందు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన రోజు వస్తుందని ఊహించలేదు. రాజ్‌కుంద్రాను మొదటిసారి కలిసినప్పుడు... ఇక నా జీవితమే మారిపోతుందని అనుకున్నాను. కెరీర్‌లో మంచి బ్రేక్ వస్తుందనుకున్నాను. కానీ శిల్పాశెట్టి భర్త నాతో ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తారని అనుకోలేదు.' అంటూ షెర్లిన్ చోప్రా కన్నీటిపర్యంతమయ్యారు.

నన్ను తప్పుదోవ పట్టించాడు : షెర్లిన్ చోప్రా

నన్ను తప్పుదోవ పట్టించాడు : షెర్లిన్ చోప్రా

'రాజ్‌కుంద్రా నా మెంటార్.కానీ అతను నన్ను తప్పుదోవ పట్టించాడు. గ్లామరస్ వీడియోలని చెప్పడంతో ఆర్మ్స్ ప్రైమ్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను. కానీ ఆ తర్వాత నాతో బోల్డ్ చిత్రాల్లో నటింపజేశారు. అర్ధనగ్న చిత్రాలతో పాటు నగ్న చిత్రాల్లో నటింపజేశారు. ఇలాంటివి అందరూ చేస్తారు... ఇందులో తప్పేమీ లేదని రాజ్‌కుంద్రా ఎప్పుడూ చెబుతుండేవారు. పోర్న్ చాలా సాధారణమని... అందరూ చేసేదే నువ్వు చేస్తున్నావంటూ నమ్మించారు.పైగా శిల్పాశెట్టికి నా ఫోటోలు,వీడియోలు చాలా నచ్చాయని చెప్పేవాడు.'అని షెర్లిన్ చోప్రా చెప్పుకొచ్చారు.

శిల్పాకు అది గుర్తుండకపోవచ్చు : షెర్లిన్ చోప్రా

శిల్పాకు అది గుర్తుండకపోవచ్చు : షెర్లిన్ చోప్రా

'శిల్పాశెట్టికి నా వీడియోలు నచ్చాయని రాజ్‌కుంద్రా తరుచూ చెప్పడం... నాకు మరింత మోటివేషన్‌ ఇచ్చినట్లయింది. శిల్పా లాంటి వ్యక్తుల నుంచి ఇలాంటి మోటివేషన్ వచ్చినప్పుడు .. ఏది తప్పు,ఏది సరైనది అనేది తేల్చుకోలేం. అలాంటి వ్యక్తుల ప్రశంసలు మనం మరింత పనిచేసేందుకు స్పూర్తినిస్తాయి.' అని షెర్లిన్ పేర్కొన్నారు. రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్‌ గురించి తనకు తెలియదని శిల్పాశెట్టి చెప్పడంపై షెర్లిన్ స్పందిస్తూ... ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి... బహుశా ఈ వ్యవహారాలు ఆమె గుర్తుండకపోవచ్చునని అన్నారు. తాను రాజ్‌కుంద్రా,శిల్పాశెట్టిలకు వ్యతిరేకం కాదని... పోర్నోగ్రఫీ రాకెట్‌కు వ్యతిరేకమని చెప్పారు. మీరు మహిళా నటులతో కాంట్రాక్టులు చేయించుకునేటప్పుడు... గ్లామరస్ వీడియోలని కాకుండా పోర్న్ చిత్రాలనే చెప్పాలి అంటూ రాజ్‌కుంద్రాను ఉద్దేశించి పేర్కొన్నారు.

అందుకే రియలైజ్ కాలేకపోయాను...

అందుకే రియలైజ్ కాలేకపోయాను...

'నా పిల్లలు పోర్న్ ఇండస్ట్రీలో పనిచేయాలని నేనెప్పుడూ కోరుకోను. వీళ్లంతా చాలా స్వార్థపరులు.. డబ్బు గురించి తప్ప మరో ఆలోచన ఉండదు.' అని షెర్లిన్ పేర్కొన్నారు. పోర్న్ చిత్రాల్లో నటించేటప్పుడు అప్పుడెందుకు రియలైజ్ అవలేదన్న ప్రశ్నకు షెర్లిన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. 'నగ్న చిత్రాల్లో నటించడం,పోర్న్ చిత్రాల్లో నటించడం సర్వసాధారణమైన విషయమని ప్రతీరోజూ మీకు చెబుతున్నప్పుడు... నిజంగానే ఆ విషయాలేవీ పెద్ద తప్పుగా తోచవు. మనమేమీ తప్పు చేయట్లేదనే స్పృహను అది కలిగిస్తుంది. రాజ్‌కుంద్రా లాంటి మెంటార్ నుంచి ఇలాంటి సలహాలు,సూచనలు వచ్చినప్పుడు... ఇంకెందుకు అనుమానపడుతాం.' అని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు రియలైజ్ అవుతున్నా...

ఇప్పుడు రియలైజ్ అవుతున్నా...

అప్పుడు తెలియలేదు గానీ... తాను తప్పు చేశాననే విషయంలో ఇప్పుడు రియలైజ్ అవుతున్నానని చెప్పారు. అయితే గన్‌తో నన్నెవరూ బెదిరించి ఆ చిత్రాల్లో నటింపజేయలేదు. కానీ నన్ను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. పోర్నోగ్రఫీ రాకెట్‌కు వ్యతిరేకంగా మరింత మంది మహిళలు ముందుకొచ్చి గొంతెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. అది పోర్న్ కాదు,ఎరోటికా అన్న శిల్పా వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఒకసారి ఆ కంటెంట్ చూశాక ఎవరైనా జడ్జ్ చేయాలన్నారు.

గత నెలలో రాజ్‌కుంద్రా అరెస్ట్...

గత నెలలో రాజ్‌కుంద్రా అరెస్ట్...

రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులుజులై 19 రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. రాజ్‌కుంద్రాపై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్‌ కుంద్రా పాత్ర కీలకంగా ఉందని నిర్దారించామన్నారు. 'ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిబ్రవరి,2021లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైంది. పోర్న్ చిత్రాల నిర్మాణం,పలు యాప్స్‌లో వాటిని అప్‌లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు చేశాం. ఇందులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

కాంట్రాక్ట్ కాపీలు లీక్...

కాంట్రాక్ట్ కాపీలు లీక్...

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కథనం ప్రకారం... కొంతమంది నటీనటులకు,మోడల్స్‌కు ఇండస్ట్రీలో బ్రేక్ ఇస్తామని ఆశలు కల్పించి రాజ్‌కుంద్రా వారితో పోర్న్ కాంట్రాక్టుపై సంతకాలు చేయించారు. ఒకవేళ వాటిపై సంతకాలు చేయకపోతే,అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోతే.. వారికి ఇండస్ట్రీలో బ్రేక్ రాదని బెదిరించేవారు. 'శృంగార,అశ్లీల,నగ్న,ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నా ఇష్టపూర్తిగా నేను అంగీకారం తెలుపుతున్నాను. ఇందులో ఏ నిర్మాణ సంస్థ ఒత్తిడి లేదు.ఈ విషయంలో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. ఆ దృశ్యాలను ఓటీటీ లేదా వెబ్‌సైట్‌లో విడుదల చేసే సినిమా కోసం ఉపయోగించినా... నాకెటువంటి అభ్యంతరం లేదు.దానిపై నేనెటువంటి ఆరోపణలు చేయను.' అని వారితో పోర్న్ కాంట్రాక్ట్ పత్రాలపై సంతకాలు చేయించుకుంటారు.

English summary
Bollywood heroine Shilpashetty's husband Rajkundra Porn Racket-Sherlyn Chopra alleged that he was misguided her into acting in porn films. She allegedly made glamorous videos and made an agreement with her ... and then acted in bold films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X