• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Porn Racket: పోర్న్ కాంట్రాక్ట్ కాపీ లీక్... అశ్లీల చిత్రాల్లో నటీనటుల అంగీకారం కోసం...

|

పోర్న్ రాకెట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం రాజ్‌కుంద్రా చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోర్న్ చిత్రాల్లో నటించేందుకు నటీనటుల అంగీకారం కోరే పత్రాలను పోలీసులు చార్జిషీట్‌లో ఫైల్ చేయగా... తాజాగా జాతీయ మీడియా 'ఇండియా టుడే' ఆ కాపీలను బయటపెట్టింది.ఆ కాపీలు నటీనటుల అంగీకారం కోరుతూ వారితో కాంట్రాక్ట్ కోసం రూపొందించినవే అయినప్పటికీ... వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నటీనటులను బెదిరించి,బ్లాక్‌మెయిల్ చేసి వారితో ఆ పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారని చెబుతున్నారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కథనం ప్రకారం... కొంతమంది నటీనటులకు,మోడల్స్‌కు ఇండస్ట్రీలో బ్రేక్ ఇస్తామని ఆశలు కల్పించి వారితో పోర్న్ కాంట్రాక్టుపై సంతకాలు చేయించారు. ఒకవేళ వాటిపై సంతకాలు చేయకపోతే,అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోతే.. వారికి ఇండస్ట్రీలో బ్రేక్ రాదని బెదిరించేవారు. 'శృంగార,అశ్లీల,నగ్న,ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నా ఇష్టపూర్తిగా నేను అంగీకారం తెలుపుతున్నాను. ఇందులో ఏ నిర్మాణ సంస్థ ఒత్తిడి లేదు.' అని వారితో పోర్న్ కాంట్రాక్ట్ పత్రాలపై సంతకాలు చేయించుకుంటారు.

rajkundra porn racket case copy of contract with actors leaked out

ఇండియా టుడే బయటపెట్టిన ఆ పోర్న్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ :

'ఫ్లిజ్ మూవీస్ బ్యానర్‌పై రూ.10,000 ప్యాకేజీతో ................... పేరుతో ప్రముఖ ఓటీటీలో విడుదల కానున్న మీ కొత్త వెబ్ సిరీస్ కోసం నన్ను ఆర్టిస్ట్‌గా తీసుకోవడానికి అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను.నాతో చర్చించినట్లుగా షూటింగ్ తేదీలు ........... లిప్ లాక్‌తో సహా సన్నిహిత, శృంగార, బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు నా సమ్మతి తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం టాప్‌లెస్,నగ్న,ముద్దు,ఇతరత్రా సన్నివేశాల్లో నటించడానికి నా ఇష్టపూర్తిగా నేను అంగీకరించాను. ఈ విషయంలో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. ఆ దృశ్యాలను ఓటీటీ లేదా వెబ్‌సైట్‌లో విడుదల చేసే సినిమా కోసం ఉపయోగించినా... నాకెటువంటి అభ్యంతరం లేదు.దానిపై నేనెటువంటి ఆరోపణలు చేయను.'

రాజ్‌కుంద్రాపై ఆరోపణలు :

  Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu

  ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త,వ్యాపారవేత్తను రెండు రోజుల క్రితం ముంబై పోలీసులు పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హాట్ షాట్స్ అనే మొబైల్ యాప్ కోసం అతను పోర్న్ చిత్రాలు నిర్మించినట్లుగా ఆరోపణలుగా ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో ఇప్పటివరకూ 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రాకు ఈ నెల 23 వరకు కోర్టు కస్టడీ విధించింది.

  ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గెహానా వశిష్ట అనే బాలీవుడ్ నటిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రాజ్‌కుంద్రా పోలీసులకు రూ.25 లక్షలు ఇచ్చి తప్పించుకున్నారన్న ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యశ్ ఠాకూర్ మార్చి నెలలో దీనికి సంబంధించి ఏసీబీకీ మెయిల్ పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోర్న్ రాకెట్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

  English summary
  A copy leaked out regarding the contract with actors to act in porn films,in porn racket case.Police say a copy of this contract has been included in the chargesheet filed against people and firms accused in the porn films racket case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X