వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్‌నాథ్‌కు పెరిగిన ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేబినెట్ కమిటీల ఏర్పాటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రాధాన్యం తగ్గించి తప్పటడుగు వేసింది. హోం మంత్రి అమిత్ షాకు ఎనిమిది, నిర్మలా సీతారామన్‌కు 7, పీయూష్ గోయెల్‌కు 5 కమిటీల్లో స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం.. పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌ను రెండు కమిటీలకే పరిమితం చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తడం, ఆర్ఎస్ఎస్ ఆగ్రహంతో తప్పు దిద్దుకుంది.

గురువారం ప్రకటించిన కేబినెట్ కమిటీల్లో బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌కు కీలక కమిటీల్లో స్థానం కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మోడీ నిర్ణయంతో మనస్తాపానికి గురైన రాజ్‌నాథ్ ఒక దశలో రాజీనామాకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహంచిన ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. రాజ్‌నాథ్‌ను పక్కన బెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Rajnath included in another four cabinet committes

దీంతో తప్పు దిద్దుకున్న మోడీ సర్కారు ఆయనకు మరో నాలుగు కమిటీల్లో సభ్యుడిగా నియమించింది. భద్రత, రాజకీయ వ్యవహారాలతో పాటు ఆర్థిక, పార్లమెంటరీ, అభివృద్ధి పెట్టుబడులు, ఉపాధి నైపుణ్యాభివృద్ధి కేబినెట్ కమిటీల్లో రాజ్‌నాథ్‌కు చోటు కల్పించింది.గురువారం నాటి పరిణామాలు కేంద్రంలో రాజ్‌నాథ్ ప్రాధాన్యం క్రమేపీ తగ్గుతోందనడానికి నిదర్శనంగా నిలిచింది.

మరోవైపు కమిటీల కూర్పులో హోం మంత్రి అమిత్ షా ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. కీలక నిర్ణయాలు తీసుకునే అన్ని కమిటీల్లోనూ ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు నీతి ఆయోగ్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా నియమించారు. ప్రధాని సభ్యుడిగా లేని రెండు కమిటీల్లోనూ అమిత్ షా మెంబర్‌గా ఉండటం విశేషం.

English summary
Defence minister Rajnath Singh was included in the core cabinet committee on political affairs and some other panels on Thursday night after the veteran complained about being marginalised during the day in an exercise that reaffirmed home minister Amit Shah’s dominance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X