• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సచిన్-సెహ్వాగ్‌ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్‌నాథ్

|

గతేడాది లోక్ సభ ఎన్నికల్లో 'పుల్వామా ఉగ్రదాడి'ని ప్రస్తావిస్తూ, అమర జవాన్ల సాక్షిగా ఓట్లు అడిగి విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నది. తూర్పు లదాక్ లో చైనా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 'బీహార్ రెజిమెంట్' జవాన్ల త్యాగాలను ఓటర్లు గుర్తుచేసుకోవాలని సాక్ష్యాత్తూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేవలం సైనికుల త్యాగాలనేకాదు, క్రికెట్ క్రేజ్ ను సైతం ఆయన ప్రస్తావించడం గమనార్హం.

జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ

గాల్వాన్‌ హింస గుర్తుందిగా..

గాల్వాన్‌ హింస గుర్తుందిగా..

తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 14వ పెట్రోలింగ్ పాయింట్ వద్ద ఈ ఏడాది జూన్ 15 రాత్రి.. చైనా బలగాలు, భారత ఆర్మీలోని ‘బీహార్ రెజిమెంట్' సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరగ్గా, రెజిమెంట్ సారధి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అమర జవాన్లలో ఎక్కువ మంది బీహార్ కు చెందినవాళ్లే కావడం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ బుధవారం భగల్ పూర్, కహల్ గావ్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జూన్ 15 నాటి గాల్వాన్ హింసాత్మక ఘటనను ఓటర్లకు గుర్తుచేశారు.

జవాన్ల త్యాగం మర్చిపోలేనిది..

జవాన్ల త్యాగం మర్చిపోలేనిది..

‘‘చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో గాల్వాన్ లోయలో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బీహార్ రెజిమెంట్ కు చెందిన జవాన్లు మాతృభూమి పరిరక్షణ కోసం అమరులైపోయారు. బీహార్ రెజిమెంట్ సైనికుల త్యాగం ఎన్నటికీ మర్చిపోలేనిది. అందుకుగానూ అమరులకు నా ధన్యవాదాలు'' అని రాజ్ నాథ్ అన్నారు. చైనాను కట్టడి చేయడంలో మోదీ సర్కారు విఫలమైందని, కేంద్రం తప్పిదాల కారణంగానే 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు గతంలో విమర్శించిన నేపథ్యంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు..

సచిన్ -సెహ్వాగ్‌లా సూపర్ హిట్

సచిన్ -సెహ్వాగ్‌లా సూపర్ హిట్

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్ ల జోడి మాదిరిగానే బీహార్ లో నితీశ్-మోదీ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచిందని రాజ్ నాథ్ అభివర్ణించారు. బీహార్ కు నితీశ్ అంతా చేసేశారని చెప్పలేనప్పటికీ.. తన శక్తికి మించి పని చేశారని, గడిచిన 15 ఏళ్లలో ఆయన పనితీరు అద్భుతమని, ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమిపైనా తీవ్ర విమర్శలు చేసిన ఆయన..

  Bihar Elections 2020 : PM Modi To Hold 12 Election Rallies in Bihar| NDA alliance VS Mahagathbandhan
   లాంతరు పగిలి.. ఆయిల్ లీక్..

  లాంతరు పగిలి.. ఆయిల్ లీక్..

  కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తోడుగా మహాకూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి రాజ్ నాథ్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ ఎన్నికల గుర్తు ‘లాంతరు'ను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం లాంతరు పగిలిపోయిందని.. అందులోని ఆయిల్ లీకైపోయిందని.. చేయడానికిగానీ, చెప్పుకోడానికిగానీ ఆ కూటమికి ఒక్క పాయింటూ లేదని ఎద్దేవా చేశారు. లాంతరు చీకట్లను తరిమికొట్టి, బీహార్ లో అభివృద్ధి వెలుగులు నింపిన ఘనత సీఎం నితీశ్ కుమార్, ఆయన డిప్యూటీ సుశీల్ మోదీలకు దక్కుతుందని రాజ్ నాథ్ అన్నారు.

  జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

  English summary
  in an election rally in Bhagalpur on wednesday, Defence Minister Rajnath Singh mentions martyred Bihar Regiment soldiers who lost their lives during the border standoff with China. rajnath also stated BJP-JD(U) alliance ‘superhit’ like Sachin-Sehwag in cricket.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X