బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చరిత్ర సృష్టించిన రాజ్‌నాథ్.. ప్రాణాలకు తెగించి ఆకాశంలో..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rajnath Singh Flies In LCA Tejas || చరిత్ర సృష్టించిన రాజ్‌నాథ్!! || Oneindia Telugu

బెంగళూరు : రక్షణశాఖ .. దేశ ఆయుధ బాండాగారం తెలిపే విభాగం. బడ్జెట్‌లో రక్షణశాఖకు కేటాయింపులు ఎక్కువ చేస్తుంటారు. ఇదివరకు రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జార్ని ఫెర్నాండెజ్ సియాచిన్ గ్లేసియర్‌ను చాలా సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు. అంతకుముందు ఏ రక్షణశాఖ మంత్రి కూడా అన్ని పర్యాయాలు వెళ్లేందుకు సాహసించలేదు. తర్వాత తొలి రక్షణశాఖ మహిళా మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొన్నారు. మోడీ 2.0 క్యాబినెట్‌లో డిఫెన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ కూడా వారి వరుసలోనే ముందుకెళ్తున్నారు.

రాజ్‌నాథ్ రికార్డు ..

రాజ్‌నాథ్ రికార్డు ..

బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్‌పోర్టు .. ఒక్కటే ఉత్కంఠ ... అందరూ అలా చూస్తుండగా వచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆయనతోపాటు ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ కూడా వచ్చారు. వారిద్దరూ కలిసి జీ సూట్ వేసుకొని తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో గగన విహారం చేశారు. నేషనల్ ప్లైట్ టెస్ట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా ఎన్ తివారీ పనిచేస్తున్నారు.

యుద్ధ విమానంలో అలా ..

రాజ్‌నాథ్, తివారి కలిసి రెండుసీట్ల తేజస్ యుద్ధ విమానంలో పయనించారు. అంతకుముందు ట్విట్టర్‌లో రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇవాళ తనకు గొప్ప రోజు కానుందని పేర్కొన్నారు. తేలికపాటి తేజస్ యుద్ధ విమానంలో పయనిస్తున్నామని ముందుగానే నెటిజన్లతో పంచుకున్నారు. తేజస్‌లో రాజ్‌నాథ్ పర్యటించడం ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తోందని తేజస్ యుద్ధ విమానాన్ని రూపొందించిన బృందంలో రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

మరో మైలురాయి ..

తేజస్ నావికా సంస్కరణ అభివృద్ధిలో కీలక మైలురాయ సాధించింది. ఈ తేలికపాటి యుద్ధ విమానం ఇదివరకు వెంటనే ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. తేజస్ యుద్ధ విమానాన్ని బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ రూపొందించింది. ఇది రక్షణశాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీనికి హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా సహకారం అందించింది. సింగిల్ ఇంజిన్, డెల్టా వింగ్, మల్టీ రోల్ ఫైటర్ లాంటి ప్రత్యేక విడి భాగాలను అమర్చారు.

మరోసారి పరిశీలించి ..

మరోసారి పరిశీలించి ..

తేజస్ యుద్ధ విమానంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించే 30 నిమిషాల ముందు .. తేజస్‌ను నిశీతంగా పరిశీలించారు. రాడార్, నియంత్రణ వ్యవస్థ, గ్లాస్ కాక్‌పీట్ ఎలా ఉందనే అంశాన్ని మరోసారి పరిశీలించామని రక్షణశాఖ ఉన్నతాధి ఒకరు మీడియాకు తెలిపారు. తమిళనాడులోని కొయంబత్తూరు సమీపంలో గల సులురు‌కు చెందిన స్క్వాడ్రన్ సేవలను కూడా వినియోగించామని వివరించారు. ఆ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

English summary
defence Minister Rajnath Singh on Thursday flew in the Tejas fighter aircraft from the HAL airport in Bengaluru, becoming the first defence minister to fly in the indigenously built light combat aircraft (LCA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X