వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే మళ్లీ పాక్ సరిహద్దు దాటుతాం: రాజ్‌నాథ్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాది హఫీజ్ సయీద్ వంటి వారికి రాజకీయ చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన హఫీజ్‌ను పాక్ అందలమెక్కిస్తోందని విమర్శించారు. భారత భద్రతా బలగాలు అవసరమైతే మళ్లీ పాక్ సరిహద్దులు దాటుతాయని హెచ్చరించారు.

 Rajnath Singh hits out at Pak, says Indian forces can cross border if needed to protect country

కాశ్మీర్ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. పాక్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని, కానీ అందుకు విరుద్దంగా ఆ దేశం వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు.

న్యూస్ 18 రైజింగ్ ఇండియా సదస్సులో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారు. కాశ్మీర్ పైన తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు.

దీనిపై మాట్లాడేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్‌ను ప్రభుత్వం నియమించిందని, ఎవరితో అయినా మాట్లాడేందుకు ఆయన సిద్ధమన్నారు.

English summary
Blasting Pakistan for giving political legitimacy to terror mastermind Hafiz Saeed, home minister Rajnath Singh said on Saturday security forces can cross over the Line of Control, if needed, to protect country's territorial integrity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X