వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బర్ ది గ్రేట్ అయితే, మహారాణా ప్రతాప్ కూడా: రాజ్‌నాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తి గొప్పవాడు అనడంలో సందేహం లేదని, ఆయనను గొప్పగా కీర్తించిన చరిత్రను కూడా తప్పుబట్టమని, అయితే రాజ్‌పుట్, మేవార్ రాజు మహారాణా ప్రతాప్ కూడా అంతేస్థాయి కలిగిన వ్యక్తి అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం అన్నారు.

దేశంలో పాఠ్యాంశాల్లో రాణా ప్రతాప్‌కు సరైన స్థానాన్ని కల్పించలేకపోయారని చెప్పారు. హల్ధీఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓడిపోయిన సంగతిని తాను కూడా అంగీకరిస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో చరిత్రను సరైన రీతిలో సవరించాల్సి ఉందన్నారు.

అక్బర్ ది గ్రేట్ అయితే, రాణా ప్రతాప్ కూడా ది గ్రేట్ అన్నారు. స్వదేశం కోసం పోరాడిన ఎంతోమందికి రాణా ప్రతాప్ ఆదర్శంగా నిలిచారన్నారు. కన్నభూమి కోసం అతను చేసిన త్యాగాలు కొనియాదగినవన్నారు. రాణా ప్రతాప్‌ను ఆదర్శంగా తీసుకొనే వియత్నామీలు అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఓడించాలన్నారు.

Rajnath Singh

ప్రతాప్ ఘడ్ జిల్లా కలెక్టరేట్‌లో రాజ్‌నాథ్ సింగ్ రాణాప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాను వ్యక్తిగతంగా మహారాణా ప్రతాప్ గ్రేట్ అని భావిస్తానని చెప్పారు. మహారాణా ప్రతాప్‌ను రానున్న జనరేషన్‌కు గ్రేట్ వ్యక్తిగా పరిచయం చేయాల్సి ఉందన్నారు.

మొఘలుల పైన పోరాడిన మహారాణా ప్రతాప్... చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి వారితో పాటు ఛత్రపతి శివాజీ, బందా బైరాగీలకు కూడా ఆదర్శనీయుడన్నారు. మహారాణా ప్రతాప్ ఓ కులానికి చెందిన రాజు కాదని, ఆయన అందరికీ ఆదర్శమన్నారు.

English summary
Rajnath Singh says if Akbar is ‘Great’, so is Maharana Pratap, wants history books corrected
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X