• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైమానిక దళానికి అసలు సిసలు ఆయుధ పూజ: రాఫెల్ అందుకోనున్న రాజ్ నాథ్ సింగ్

|

ప్యారిస్: వైమానిక దళం అసలు సిసలు ఆయుధ పూజకు సిద్ధపడుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ ను అందుకోనుంది. ఫ్రాన్స్ లో తయారైన ఈ యుద్ధ విమానాలను లాంఛనంగా స్వీకరించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ దేశానికి బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ తో భేటీ అవుతారు. ఆయన చేతుల మీదుగా రాఫెల్ యుద్ధ విమానాలను అందుకుంటారు. ఫ్రాన్స్ తీర ప్రాంత నగరం బెర్డెక్స్ లో రాఫెల్ యుద్ధ విమానాలకు రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజను నిర్వహిస్తారు. అనంతరం అందులో కొంత సేపు ప్రయాణిస్తారు.

ఈ తరహా యుద్ధ విమానం వాయుసేన అమ్ములపొదిలో చేరడం ఇదే తొలిసారి. రాఫెల్ విమానాలను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ సుమారు 60 వేల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందంలో భాగంగా డసాల్ట్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసింది. వైమానిక దళ వార్షికోత్సవ నేపథ్యంలో రాజ్‌ నాథ్ సింగ్ విజయదశమి నాడు వాటిని అందుకోనున్నారు. అత్యంత శక్తివంతమైన మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను సంతరించుకుని ఉండటం దీని ప్రత్యేకత.

ఖచ్చితంగా పీఓకేను స్వాధీనం చేసుకుంటాం : విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్

Rajnath Singh to receive IAF’s first Rafale jet today

భారత్‌కు ఉపఖండ గగనతలంలో భారత్ శక్తిమంతంగా ఎదుగుతుందని ఆ దేశ వైమానిక దళానికి ఇక ఎదురు ఉండదని క్షిపణి వ్యవస్థలను రూపొందించిన ఎంబిడిఎ సంస్థ ప్రతినిధి లోయిక్ పియిడెవెక్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్‌, ఫ్రెంచ్ వైమానిక దళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మెరుపు వేగంతో, చురుకైన రాడార్ వ్యవస్థతో క్షిపణి వ్యవస్థ అధునాతన రీతిలో, దేనికీ తీసిపోకుండా ఉంటుందని లోయిక్ తెలిపారు. తన ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి నేతలతో సమావేశమవుతారు. భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

English summary
Defence Minister Rajnath Singh will meet French President Emmanuel Macron in Paris on October 8 and receive the first of the 36 Rafale aircraft in the French port city of Bordeaux, where he will perform ‘Shastra Puja’ on the occasion of Dussehra and take a sortie in the fighter jet. “This great nation is India’s important strategic partner and our special relationship goes far beyond the realm of formal ties,” Singh tweeted after his arrival in Paris on October 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X