బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రధానికి సొంత ఇల్లు లేదు, ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు, ఆస్తి ఎన్ని రూ. కోట్లు అంటే ? షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరులో తనకు సొంత ఇల్లు లేదని ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పని చేసిన హెచ్.డీ. దేవేగౌడకు బెంగళూరులో సొంత ఇల్లు లేదని వెలుగు చూడటంతో ప్రజలు షాక్ కు గురైనారు.

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు హెచ్.డి. కుమారస్వామి రెండు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ తనకు బెంగళూరులో సొంత ఇల్లు లేదని స్పష్టం చెయ్యడంతో అందరూ షాక్ కు గురైనారు. అంతే కాకుండా మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఎన్ని కొట్ల రూపాయలకు ఆస్తిపరుడు, ఆయన సతీసమణికి ఎంత ఆస్తి, అప్పులు ఉన్నాయి ? అనే విషయం బహిరంగంగా వెలుగు చూసింది.

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే?Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే?

 చక్రం తిప్పిన దేవేగౌడ

చక్రం తిప్పిన దేవేగౌడ

జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన హెచ్.డీ. దేవేగౌడ దేశంలో చురుకైన, తెలివైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పరిస్థితులు అనుకూలించడంతో దేశ ప్రధానిగా హెచ్.డీ. దేవేగౌడ పగ్గాలు చేపట్టారు. ఇంత వరకు దేశ ప్రధాని అయిన మొట్టమొదటి కన్నడిగుడిగా హెచ్.డీ. దేవేగౌడ రికార్డు సృష్టించారు. దేవేగౌడ తరువాత ఇంత వరకు ఏ కన్నడిగ ప్రధాన మంత్రి పదవి చేపట్టలేదు.

మనుమడి కోసం త్యాగం

మనుమడి కోసం త్యాగం

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కర్ణాటకలోని హాసన్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా ఎంపీగా గెలుపొందుతూ వచ్చారు. అయితే మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం సొంత నియోజక వర్గం హాసన్ లోక్ సభ స్థానం వదులుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ గత లోక్ సభ ఎన్నికల్లో తుమకూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హాసన్ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం ఎంపీగా విజయం సాధించారు.

 వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం

వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం

ప్రస్తుతం కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీఎస్ పార్టీ నుంచి మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడను రంగంలోకి దింపాలని ఆయన కుమారుడు, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి చక్రం తిప్పారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 45 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. జేడీఎస్ పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది.

సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్

సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్

గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి సీఎం సీటును త్యాగం చేసి హెచ్.డీ. కుమారస్వామిని సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ మరోసారి కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా మద్దతు ఇస్తామని సోనియా గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. సోనియా గాంధీ హామీ ఇవ్వడంతో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఇప్పటికే జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

మాజీ ప్రధానికి సొంత ఇల్లు లేదు

మాజీ ప్రధానికి సొంత ఇల్లు లేదు

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆయన ఆస్తులు, అప్పులు తదితర వివరాలతో రాజ్యసభ ఎన్నికల అధికారిని, కర్ణాటక శాసన సభ కార్యదర్శి విశాలాక్షికి అఫిడవిట్ సమర్పించారు. మాజీ ప్రధాని దేవేగౌడకు 1974 మోడల్ కు చెందిన మూడు అంబాసిడర్ కార్లు ఉన్నాయని, బెంగళూరులో తనకు సొంత ఇల్లు లేదని అఫిడవిట్ సమర్పించారు. మాజీ ప్రధాని దేవేగౌడ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరాస్తి రూ. 41. 28 లక్షలు. మాజీ ప్రధాని దేవేగౌడ సతీమణి చెన్నమ్మ స్థిరాస్తి రూ. 5.38 కోట్లు ఉంది. మాజీ ప్రధాని చరాస్థి రూ. 72. 50 లక్షలు ఉంటే ఆయన సతీమణి చెన్నమ్మ చరాస్థి రూ. 2. 14 కోట్లు ఉంది.

మాజీ ప్రధాని కంటే ఆయన సతీమణి ఆస్తి !

మాజీ ప్రధాని కంటే ఆయన సతీమణి ఆస్తి !

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కంటే ఆయన సతీమణి చెన్నమ్మ ఆస్తి విలువ ఎక్కువగా ఉందని అఫిడవిట్ ప్రకారం వెలుగు చూసింది. మాజీ ప్రధాని దేవేగౌడకు 23 ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి ( విలువ రూ. 27. 05 లక్షలు) ఉంది. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సతీమణి చెన్నమ్మకు 3 ఎకరాల 28 గుంటల వ్యవసాయ భూమి ఉంది. మాజీ ప్రధాని దేవేగౌడ సతీమణి చెన్నమ్మకు వ్యవసాయ భూమి వలన సంవత్సరానికి రూ. 15. 03 లక్షల ఆధాయం వస్తోందని అఫిడవిట్ లో వివరాలు సమర్పించారు.

Recommended Video

COVID-19 Cases Crossed 2,66,598 Mark In India, 9,987 New Cases Found In 24Hrs
 షాక్ తో ప్రజల దిమ్మతిరింది

షాక్ తో ప్రజల దిమ్మతిరింది

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడకు ఏ బ్యాంకులో అప్పులు లేకపోయినా ఆయన భార్య చెన్నమ్మ పేరుతో రుణాలు ఉన్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పని చేసిన హెచ్.డీ. దేవేగౌడ తనకు బెంగళూరులో సొంత ఇల్లు లేదని రాజ్యపభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించడంతో జేడీఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజలు షాక్ కు గురైనారు.

English summary
Karnataka Rajya Sabha Election 2020: Here is Former PM and JDS candidate HD Deve Gowda declared assets and liabilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X