వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ మార్షల్స్ కొత్త యూనిఫాం.. భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

రాజ్యసభ మార్షల్స్ యొక్క కొత్త యూనిఫాంపై భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. దీనిని చట్టవిరుద్ధంగానూ ,భద్రతాపరమైన ప్రమాదం గానూ ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ నుండి సైనిక తరహా దుస్తులు మరియు క్యాప్ లతో వారి యూనిఫాంలు మార్చటంతో మార్షల్స్ ఒక ఆర్మీలా కనిపిస్తున్నారు. అందుకే భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మార్షల్స్ అంతకుముందు వేసవి నెలల్లో సఫారీ సూట్లు మరియు శీతాకాలంలో భారతీయ బంధగల్ సూట్ లను టర్బన్‌లతో పాటు ధరించేవారు. తాజా మారిన వారి కొత్త యూని ఫాం విషయంలో వేద్ మాలిక్ ట్వీట్ చేస్తూ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లను తన ట్వీట్‌లో ట్యాగ్ చేసిన మాలిక్, రక్షణ మంత్రి ముందస్తు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Rajya Sabha marshals new uniform .. objection of former Indian Army chief Ved Malik

రాజ్యసభ సోమవారం 250 వ సెషన్‌ను ప్రారంభించింది. ఈ సెషన్ లో మార్షల్స్ తన నూతన యూనిఫాం తో కనిపించారు. సైనిక తరహా యూనిఫాంలు మరియు టోపీలతో ఇద్దరు మార్షల్స్ కవాతు చేసారు, ఇది రాజ్యసభ సభ్యులను ఆశ్చర్యపరిచింది. కొత్త నేవీ బ్లూ యూనిఫాం, అది కూడా ఆర్మీ స్టైల్ లో ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు . సంస్మరణ సూచనలు చేస్తున్నప్పుడు, ఒక సభ సభ్యుడు పక్కన ఉన్న వారు రాజ్యసభ మార్షల్స్ నేనా అని ప్రశ్నించగా రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వెంటనే, "అవును, వారు మార్షల్స్" అని సమాధానం ఇచ్చారు.

మొత్తానికి రాజ్యసభ మార్షల్స్ విషయంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ వ్యక్తం చేసిన అభ్యంతరం ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌ లు పట్టించుకుంటారా ? వారు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.

English summary
Former Indian Army chief Ved Malik objected to to the new uniform of Rajya Sabha marshals, called it illegal and a security hazard. The marshals got a makeover with their uniforms being restyled from traditional Indian attire to military-style outfits with caps. The marshals earlier wore safari suits during the summer months and Indian bandhgalas during the winter along with turbans. Malik, who was the Indian Army chief during the Kargil conflict, took to social media to raise concerns over the new look of the Rajya Sabha marshals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X