వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బాస్‌లో వల్గారిటీ, అసభ్యత: 'పెద్దల సభ' ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిగ్ బాస్ వంటి పలు రియాలిటీ టీవీ షోల కంటెంట్ విషయంలో రాజ్యసభలో మంగళవారం విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సభ్యులు మాట్లాడుతూ... అటువంటి కార్యక్రమాలు అసభ్యంగా, అమర్యాదకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్నిసార్లు అమ్మాయిలు కురచ దుస్తులతో నృత్యం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రసారమవుతున్నాయన్నారు. వెంటనే ఇందుకు సభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. అలాంటి కార్యక్రమాలు ఛానళ్లలో వస్తున్నప్పుడు ఫిర్యాదు చేసేందుకు ఓ టెలిఫోన్ నంబర్ డిస్ ప్లే అవుతుందన్నారు.

Rajya Sabha members find ‘Bigg Boss 8′ ‘vulgar’ and ‘indecent’

కార్యక్రమాలలో ఏదైనా ఉల్లంఘన ఉంటే తప్పకుండా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం చూసేవారి ఫిర్యాదు ఆధారంగానే కాకుండా తాము పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ చెప్పారు.

ఫిర్యాదులను పరిశీలించేందుకు శాఖకు సొంతంగా ఓ సెల్ ఉందని చెప్పారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

గత ఏడాది 40వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో 1500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. చానళ్ల కార్యక్రమాల పైన పర్యవేక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ 1500 టీవీ చానల్స్‌ను ఏకకాలంలో మానిటర్ చేస్తోందన్నారు.

English summary
The content aired in reality TV shows such as ‘Bigg Boss’ came in for criticism in Rajya Sabha today, with some members expressing anguish over “vulgarity” and “indecency” in the programmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X