• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ చివరికి అక్కడ కూడా ఖాళీ అవుతుందా.. కీలకనేత రాజీనామా

|

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలింది. ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సంజయ్ సింగ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ కంచుకోట అమేథీలో సింగ్ కీలక నేత. ఇప్పటికే ఆ స్థానం బీజేపీ గెలుచుకోగా .. సింగ్ కూడా కమలదళంలో చేరడంతో ఆ పార్టీకి మరింత బూస్టింట్ అవుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

మరో దెబ్బ ..

మరో దెబ్బ ..

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం ఆ పార్టీకి పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. తర్వాత గోవాలో సీఎల్పీ బీజేపీలో విలీనం, తెలంగాణ సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం, కర్ణాటకలో ప్రభుత్వం పడిపోవడం .. దీంతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో రాహుల్ అధ్యక్ష పదవీకి దూరంగా ఉండటం కూడా మైనసవుతుంది. దీంతో కొందరు దగ్గరగా ఉండే నేతలు కూడా పార్టీని వీడేందుక సిద్ధమవుతున్నారు. అదేబాటలో నడిచారు సంజయ్ సింగ్. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, అమేథీలో కీలకనేత అయిన సంజయ్ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమోదం

ఆమోదం

సింగ్ ప్రస్తుతం అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తన ఎంపీ పదవీకి కూడా రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సింగ్ రాజీనామాను కూడా ఆమోదించారు. తాను బుధవారం బీజేపీలో చేరతానని ప్రకటించారు. తాను పార్టీని ఎందుకు వీడుతున్నానో వివరించారు. పార్టీ ఇంకా పాత విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ హవా నడుస్తోందని పేర్కొన్నారు. దేశం మొత్తం మోడీ వెంట ఉన్నారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే తాను కూడా మోడీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని స్పష్టంచేశారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. బుధవారం బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు సింగ్.

మేనకా చేతిలో ఓటమి

మేనకా చేతిలో ఓటమి

1990కి ముందు బీజేపీలో ఉన్నారు. తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో కూడా సూల్తాన్ పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ యూపీ రాజకీయాల్లో ప్రభావం చూపగల నేత సింగ్. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద లోటే. మరి ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించాల్సి ఉంది. ఇన్నాళ్లు అమేథీలో అంటిపెట్టుకుని ఉన్న సింగ్ స్థానంలో మరొకరిని నియమిస్తారా అనేది తేలాల్సి ఉంది.

English summary
Rajya Sabha member Sanjay Singh, who hails from the Amethi royal family, resigned from the Congress on Tuesday and said he would join the BJP on Wednesday. Singh, a Congress member of the Rajya Sabha from Assam, also resigned from the Upper House of Parliament, sources said, adding that Rajya Sabha Chairman M Venkaiah Naidu has accepted his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X