వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎంపిల ఆర్జనలు: సచిన్ టెండూల్కర్ టాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, జయాబచ్చన్ సహా 87 మంది రాజ్యసభ ఎంపీలకు ఆర్థిక లావాదేవీలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. పార్లమెంట్ ఎగువసభలోని 211 మంది సిట్టింగ్ ఎంపీలు సమర్పించిన అఫిడవిట్‌లలో వారు ఆసక్తి కలిగిఉన్న అంశాన్ని అధ్యయనం చేసిన ఏడీఆర్, 124 మంది సభ్యులు వాణిజ్యపరమైన లేదా ఆర్థికపరమైన ఆసక్తి ఉన్నట్లు ప్రకటించారని తెలిపింది.

నిబంధనల ప్రకారం సభ్యులు ఐదు విభాగాల కింద తమ డిక్లరేషన్ ఇవ్వాలి. వృత్తిపరమైన వ్యవహారాల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్నట్లు సచిన్ టెండూల్కర్ (నామినేటెడ్ సభ్యుడు) ప్రకటించాడని ఏడీఆర్ తెలిపింది. వృత్తిపరమైన వ్యవహారాల ద్వారా సచిన్ ఫీజులు లేదా పారితోషికం రూపంలో ఏటా రూ.72.79 కోట్లు ఆర్జిస్తున్నట్లు పేర్కొంది.

Sachin Tendulkar

రూ.19.13 కోట్లతో కేటీ తులసి (నామినేటెడ్) ఉన్నారు. రూ.16.93 కోట్లతో మూడో స్థానంలో మిథున్ చక్రవర్తి (తృణమూల్, బెంగాల్) ఉన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు సేకరించినట్టు ఏడీఆర్ తెలిపింది. పారితోషికం పొందే కార్యకలాపాల నిర్వహిస్తున్న వారిలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ (రూ.82.33 కోట్లు),

కర్ణాటక నుంచి విజయ్ మాల్యా (రూ.2.51 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం సభ్యుడు వైయస్ చౌదరి (రూ.1.68కోట్లు) ఉన్నారు. రూ.10 కోట్ల కన్నా అధిక ఆస్తులు గల21 మంది ఎంపీలు తమకు డబ్బుకు సంబంధించిన అభిరుచులు లేవని తెలిపారు.

రూ.422 కోట్లకు పైగా ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీ సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్), రూ.120 కోట్ల ఆస్తులున్న గుజరాత్‌కు చెందిన అరుణ్‌జైట్లీ (బీజేపీ), రూ.111 కోట్ల ఆస్తులున్న బీఎస్పీనేత మాయావతి తమకు డబ్బుకు సంబంధించిన అభిరుచులేమీ లేవని ప్రకటించారు.

English summary
Cricketer Sachin Tendulkar, a nominated member, receives the highest amount fees/remuneration by way of professional engagements totalling Rs 72.79 crore. Figuring among the top three MPs, out of the 22 MPs who have remunerative directorships, are Vijay Mallya, Rajeev Chandrashekar and D Kupendra Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X