వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ: బీజేపీకి టీఆర్ఎస్ ఝలక్ -సంస్కృతం వద్దు- హిందీనే ముద్దు - కేశ‌వ‌రావు, సురేశ్ రెడ్డి ప్ర‌మాణం

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే సెంటర్ లోని అధికార పార్టీ బీజేపీకి.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రెండు సార్లు ఝలక్ ఇచ్చింది. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత దూకుడు పెంచిన బీజేపీ అనునిత్యం కేసీఆర్ సర్కారుపై తీవ్రవిమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునే పనిలో నిమగ్నమైంది. స్థానికంగా బీజేపీని లెక్కచేయనట్లుగానే వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్.. ఢిల్లీలోనూ దాదాపు అదే విధానాన్ని అవలంభిస్తున్నది. ఈ క్రమంలో సోమవారం రెండు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ సింగ్ - ఆర్జేడీ అభ్యర్థిపై విజయం - ప్రధాని సహా పలువురి అభినందనరాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ సింగ్ - ఆర్జేడీ అభ్యర్థిపై విజయం - ప్రధాని సహా పలువురి అభినందన

సోమవారం లోక్ సభ ముగిసిన కాసేపటికే రాజ్యసభ తొలి సెషన్ ప్రారంభమైంది. ముందుగా దివంగత నేతలకు సంతాపాలు తెలిపిన తర్వాత.. కొత్తగా ఎన్నికైన లేదా తిరిగి ఎన్నికైన 15 మంది ఎంపీల చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణాలు చేయించారు. టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలో కే కేశ‌వ‌రావు తెలుగు ప్ర‌మాణం చేయ‌గా, సురేశ్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. సురేశ్ రెడ్డి మాజీ అసెంబ్లీ స్పీక‌ర్ అని వెంక‌య్య స‌భ‌కు తెలియ‌జేశారు. ఎంపీల ప్రమాణాలు పూర్తయిన వెంటనే...

Rajya Sabha: refrain from using Sanskrit words and use Hindi instead: TRS MP Keshava Rao

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఎన్టీఏ అభ్యర్థిగా జేడీయూకు చెందిన హరివంశ్ సింగ్, యూపీఏ అభ్యర్థిగా ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా పోటీలో నిలబడ్డారు. మొత్తం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 113 మంది సభ్యుల బలముంది. దీంతో జేడీయూ.. ఎన్డీఏ బయటున్న పార్టీల మద్దతు కోరింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ కు మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా నిలిచింది. ఎన్టీఏ, యూపీఏ కూటకులకు సమాన దూరం పాటిస్తామని కేసీఆర్ చెప్పినట్లే.. కేకే, సురేశ్ రెడ్డిలు ఓటింగ్ లో పాల్గొనలేదు. అయితే..

 పార్లమెంట్‌పై కరోనా ఎఫెక్ట్: 25 మంది ఎంపీలకు పాజిటివ్ - తొలిరోజు లోక్‌సభకు 359మందే పార్లమెంట్‌పై కరోనా ఎఫెక్ట్: 25 మంది ఎంపీలకు పాజిటివ్ - తొలిరోజు లోక్‌సభకు 359మందే

ఓటింగ్ లో పాల్గొనకపోయినప్పటికీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తిరిగి ఎన్నికైన హరివంశ్ సింగ్ ను టీఆర్ఎస్ అభినందించింది. హరివంశ్ ఎన్నికలపై ప్రధాని మోదీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు మాట్లాడిన తర్వాత.. టీఆర్ఎస్ నేత కేకే తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన జాతీయ విద్యావిధానంలో చేసినట్లే.. పార్లమెంట్ లోనూ సంస్కృత భాషను ప్రోత్సహించే దిశగా బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలను కేకే ఆక్షేపించారు.

డిప్యూటీ చైర్మన్ హోదాలో హరివంశ్ సింగ్.. రాజ్యసభలో సంస్కృత పదాల వాడకాన్ని నివారించాలని టీఆర్ఎస్ ఎంపీ కేకే సూచించారు. మెజార్టీ ఎంపీలకు అర్థంకాని సంస్కృత పదాలు వాడటం కంటే.. అందరికీ అర్థమయ్యే హిందీలోనే రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించడం మంచిదని కేకే అభిప్రాయపడ్డారు. తద్వారా బీజేపీ సంస్కృతీకరణ ప్రక్రియను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని కేకే చెప్పకనే చెప్పారు. ఆయన వ్యఖ్యలపై బీజేపీ నేతలు ప్రస్తుతానికి సైలెట్ గా ఉండిపోయారు.

English summary
Telangana Rashtra Samithi (TRS) MP K Keshava Rao while congratulating Harivansh Singh for his election to the post of deputy chairman of Rajya Sabha asked MPs to refrain from using Sanskrit words and use Hindi instead to ensure that most members understand what is being said in the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X