వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

citizenship bill: రాజ్యసభ టీవీ ప్రసారాల నిలిపివేత: ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ విపక్ష సభ్యులు ఆయన ప్రసంగానికి పలుమార్లు అడ్డుతగిలారు.

సభకు తీవ్ర ఆటంకం..

సభకు తీవ్ర ఆటంకం..

తీవ్ర ఆటంకం కలిగిస్తుండటంతో రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని కాసేపు నిలిపివేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకు టీవీ ప్రసారాలను కొద్ది నిమిషాలపాటు నిలిపివేయడం జరిగింది. కాగా, అస్సాం ప్రజల హక్కులు కాపాడుతామని, బిల్లు ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగదని అమిత్ షా స్పస్టం చేశారు. ఈ బిల్లు వల్ల దేశంలోని ముస్లింలకు కూడా ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పారు.

Citizenship Bill: సువర్ణాక్షరాలతో లిఖించాలి.. పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు: మోడీ కీలక వ్యాఖ్యలుCitizenship Bill: సువర్ణాక్షరాలతో లిఖించాలి.. పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు: మోడీ కీలక వ్యాఖ్యలు

రెడ్ బటన్ నొక్కిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు

రెడ్ బటన్ నొక్కిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు


హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర ఆటంకాలు సృష్టించారు. ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఎంత వారించినా విపక్ష సభ్యులు తమ ఆందోళనలను విరమించుకోలేదు. సభ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగిస్తున్న మీ వాదనలను రికార్డుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు రాజ్యసభ ప్రసారాలను నిలిపివేయాలని వెంకయ్య నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఛైర్మన్ ఎర్ర బటన్ నొక్కడంతో టీవీ ప్రసారాలను నలిపివేయడం జరిగిందని రాజ్యసభ వర్గాలు తెలిపాయి.

సందేహాలుంటే..

సందేహాలుంటే..

ఆ తర్వాత సభ సజావుగా సాగే పరిస్థితి ఏర్పడిన తర్వాత రాజ్యసభ టీవీ ప్రసారాలను
పునరుద్ధరించినట్లు వెల్లడించాయి. అనంతరం అమిత్ షా పౌరసత్వ బిల్లుపై మాట్లాడారు. ఈ బిల్లు ఓ చరిత్రాత్మక బిల్లుగా అని అభివర్ణించారు. ఈ బిల్లు శరణార్థుల హక్కులు కాపాడుతుందని అన్నారు. బిల్లు చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సభలో సభ్యులు లేవనెత్తే అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని అమిత్ షా తెలిపారు.

పాకిస్థాన్‌లో 20శాతం మైనార్టీలు తగ్గారు..

పాకిస్థాన్‌లో 20శాతం మైనార్టీలు తగ్గారు..

ఈ బిల్లు విషయంలో భారత ముస్లింలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, ఇతర దేశాల ముస్లింలకు భారత పౌరసత్వం కల్పించలేమని తేల్చి చెప్పారు. కొంతమంది దీనిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బిల్లుపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మైనార్టీల జనాభా 20 శాతం మేర తగ్గిందని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. వారిలో చాలా మంది చనిపోయి ఉంటారని, లేదా ఆశ్రయం కోసం భారత్‌కు వచ్చి ఉంటారని తెలిపారు.

అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అస్సాం ప్రజల హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. అస్సాం ఒప్పందంలో పేర్కొన్న విధంగా అక్కడి సంస్కృతిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఈ బిల్లు షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు వర్తించదని చెప్పారు. ఈ చట్టాన్ని మిజోరాంలో అమలు చేయబోమన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆపోహల్ని తొలగిస్తామని చెప్పారు.

English summary
Rajya Sabha TV on Wednesday briefly stopped the telecast of the live proceedings from the Upper House during the presentation of the Citizenship (Amendment) Bill on the directions of Chairman M Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X