అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడే పెద్దల సభకు ఎన్నికలు.. ఏపీలో 4 సీట్లకు జరగనున్న పోలింగ్

|
Google Oneindia TeluguNews

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి నెలలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఈ రోజు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కౌంటింగ్ కూడా ఈ రోజే సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. మొత్తం 24 రాజ్యసభ సీట్లు ఖాళీ కాగా లాక్‌డౌన్ కారణంగా 18 సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే మరో 6 సీట్లు కూడా జూన్ లేదా జూలై నెలలో ఖాళీ అవుతుండటంతో వాటికి కూడా ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

Rajyasabha elections for 24 seats to be held on June 19th live updates

18 సీట్లలో చెరో నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ నుంచి ఉండగా.. జార్ఖండ్ రెండు, మధ్యప్రదేశ్ మూడు, రాజస్థాన్,మణిపూర్, మేఘాలయాల్లో ఒక్కో సీటు ఖాళీ పడ్డాయి. ఇక ఆరు సీట్లు నాలుగు కర్నాటకలో ఖాళీ కాగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో సీటు ఖాళీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరపున అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఉండగా... టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో ఉన్నారు.

Newest First Oldest First
6:41 PM, 19 Jun

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లో బీజేపీ 2 సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ ఒక సీటును తన ఖాతాలోకి వేసుకుంది
6:40 PM, 19 Jun

రాజస్థాన్

రాజస్థాన్‌లో 2సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఒక సీటు బీజేపీ కైవసం
6:27 PM, 19 Jun

టీడీపీకి ఆదిరెడ్డి భవానీ షాక్.. అవగాహన లోపంతో తప్పుగా వేసిన ఓటు
6:21 PM, 19 Jun

మొత్తం ఓట్లు 175,గైర్హాజరు2,పోలైనవి 173,చెల్లని ఓట్లు 4, వైసీపీ 152,టీడీపీ 17
6:16 PM, 19 Jun

ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య, వర్ల రామయ్యకు 17 ఓట్లు
6:15 PM, 19 Jun

వైసీపీ బరిలో ఉంచిన నలుగురు అభ్యర్థులు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానీలు గెలుపు
6:14 PM, 19 Jun

వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి 38 ఓట్లు
6:14 PM, 19 Jun

ఏపీ రాజ్య సభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తొలివిజయం సాధించినట్లు ప్రకటన
4:04 PM, 19 Jun

క్వారంటైన్‌లో ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకోని ఎమ్మెల్యే అనగాని
4:03 PM, 19 Jun

ఏపీలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్.ఓటు హక్కు వినియోగించుకున్న 173 మంది సభ్యులు
3:14 PM, 19 Jun

మధ్యప్రదేశ్‌లో ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్: కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం
2:53 PM, 19 Jun

ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
2:07 PM, 19 Jun

జైపూర్‌లో అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
12:40 PM, 19 Jun

మణిపూర్

తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్న ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్
10:18 AM, 19 Jun

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్ తమ్మినేని, సీఎం జగన్, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు
9:58 AM, 19 Jun

గుజరాత్

రాజ్యసభ ఎన్నికలకు ఓటు వేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన మతార్ బీజేపీ ఎమ్మెల్యే కేసరిసిన్హ్ జేసంగ్‌భాయ్ సోలంకి
9:56 AM, 19 Jun

మధ్యప్రదేశ్

కచ్చితంగా ఒక సీటును గెలుస్తామన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కమల్‌నాథ్. భోపాల్ అసెంబ్లీ హాలులో ఓటు వేసిన కమల్‌నాథ్
9:12 AM, 19 Jun

జార్ఖండ్

జార్ఖండ్‌ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు నేడు పోలింగ్. రాంచీలోని అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తి
9:11 AM, 19 Jun

రాజస్థాన్

రాజస్థాన్ జైపూర్‌లో అసెంబ్లీకి మూడు బస్సుల్లో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
8:50 AM, 19 Jun

గుజరాత్

రాజ్యసభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. గాంధీనగర్‌లోని అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు పూర్తి. మొత్తం నాలుగు స్థానాలకు పోటీ
8:34 AM, 19 Jun

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ బరిలో దిగ్విజయ్ సింగ్, సింధియా
8:33 AM, 19 Jun

మధ్యప్రదేశ్ గుజరాత్‌లో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు
7:33 AM, 19 Jun

కర్ణాటక

కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిల్చున్న మాజీ ప్రధాని దేవేగౌడ (జేడీఎస్), కేంద్ర మాజీమంత్రి మల్లికార్జున ఖర్గె (కాంగ్రెస్), ఈరన్న కదడి, అశోక్ (బీజేపీ). నలుగురూ గెలవడం దాదాపు ఖాయమైనట్టే
7:20 AM, 19 Jun

ఆంధ్రప్రదేశ్

ఏపీ నుంచి వైసీపీ తరపున అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో ఉన్నారు.
6:50 AM, 19 Jun

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కాస్సేపట్లో ఆరంభం కానున్న రాజ్యసభ ఎన్నికలు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అసెంబ్లీ మీటింగ్ హాలులో పోలింగ్. ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు

English summary
Elections for 24 Rajya Sabha seats spread across 10 states will be held on June 19. Polling will be done from 9:00 am to 4:00 pm on Friday, and counting of votes will commence at 5:00 pm on the same day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X