వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌రువాతి అడుగు పీవోకే స్వాధీనమే: ట‌్రంప్‌కు మిగిలేది అదే: సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారు పేరైన రాజ్య‌సభ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి మ‌రో సారి అదే ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేసారు . ఆర్టిక‌ల్ 370 రద్దు ఇప్పటికే ఆలస్యమైందన్న ఆయ‌న ఇక త‌రువాతి అడుగు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకో వడమే అంటూ కీల‌క వ్యాఖ్య చేసారు. ఆ ప్రాంతాన్ని భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్‌ ప్రధానికి చెప్పడం తప్ప.. ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌ను భార‌త్‌లో విలీనం చేయాలంటూ పివీ న‌ర‌సింహారావు హాయంలో పార్ల‌మెంట్లో చేసిన తీర్మానం విష‌యాన్ని సుబ్ర‌మ‌ణ్య స్వామి గుర్తు చేసారు.

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ స్వాధీన‌మే మిగిలి ఉంది..
రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి త‌న‌దైన శైలిలో పీఓకే గురించి ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆర్టిక‌ల్ 370ని కేం ద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన అంశం మీద ఆయ‌న స్పందించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సాహసోపేత చర్య అని చెబుతూనే.. ఈ నిర్ణ‌యం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు అభినందనలు తెలిపారు. ఇక ప్రభుత్వ తదుపరి అడుగు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే అంటూ సీరియ‌స్ కామెంట్ చేసారు. ఆ ప్రాంతాన్ని భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్‌ ప్రధానికి చెప్పడం తప్ప, ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదు అని సుబ్ర‌మ‌ణ్య స్వామి వ్యాఖ్యానిం చారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోందని సుబ్ర‌మ‌ణ్య స్వామి వివ‌రించారు.

<strong> మేనిఫెస్టోలోనే నాడు స్ప‌ష్టం చేసిన బీజేపీ: నేడు ఆచ‌ర‌ణ‌లో 370 ర‌ద్దు </strong> మేనిఫెస్టోలోనే నాడు స్ప‌ష్టం చేసిన బీజేపీ: నేడు ఆచ‌ర‌ణ‌లో 370 ర‌ద్దు

Rajyasabha Member Subramanya Swamy sensational comments on POK and abolish of article 370

పీవీ హ‌యాంలోనే తీర్మానం..
పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌ను భార‌త్‌లో విలీనం చేయాలంటూ పీవీ నిర‌సింహారావు ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే భార‌త పార్ల‌మెంట్ తీర్మాం చేసింద‌నే విష‌యాన్ని స్వామి గుర్తు చేసారు. ఆర్టికల్‌ 370ని రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్‌ వాదన వారి అజ్ఞానాన్ని సూచిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంటుకు తెలియజేయడాన్ని సముచిత చర్యగా భావి స్తున్నానని స్వామి వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌370 రద్దు ఇప్పటికే ఆలస్యమైంది. ఆర్టికల్‌ రద్దు ఏకపక్షమని వాదించే వారికి.. 5లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా అంటూ ప్ర‌శ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ స్వామి ఫైర్ అయ్యారు.

English summary
Rajyasabha Member Subramanya Swamy sensational comments on POK and abolish of article 370. He says Central Govt next step is to occupy POK form Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X