వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో సరిహద్దు వివాదాల వేళ: బీఎస్ఎఫ్ బాస్‌గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి: సీబీఐలో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారట్లేదు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనిక బలగాలు ఇంకా డెప్సాంగ్-దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్, పంగ్యాంగ్స్ త్సొ వంటి వ్యూహాత్మక ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గట్లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ వ్యాలీని చైనా బలగాలు ఖాళీ చేసినప్పటికీ.. భౌగోళికంగా, రక్షణపరంగా భారత్‌కు కీలకమైన పోస్టుల్లో ఇంకా కొనసాగుతున్నాయి. అదే సమయంలో- చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదంటూ కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది.

వరుస రాకెట్ దాడులతో వణికిన సిటీ: గ్రీన్‌జోన్‌పై: ఇండిపెండెన్స్ డే నాడు ఉగ్రవాదుల ఘాతుకంవరుస రాకెట్ దాడులతో వణికిన సిటీ: గ్రీన్‌జోన్‌పై: ఇండిపెండెన్స్ డే నాడు ఉగ్రవాదుల ఘాతుకం

ఈ పరిణామాల మధ్య- సరిహద్దు భద్రతా బలగాల విభాగానికి సరికొత్త బాస్ నియమితులు అయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ అస్తానా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులు అయ్యారు. కొద్దిసేపటి కిందట బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటిదాకా ఆయన బ్యురో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీగా పనిచేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను పర్యవేక్షించారు. రాకేష్ అస్తానా.. గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ ఆకర్షించింది.

 Rakesh Asthana takes charge as the 27th Director General of Border Security Force

ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) చీఫ్ ఎస్ఎస్ డెస్వాల్ మొన్నటి దాకా బీఎస్ఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన రాకేష్ అస్తానా బ్యాచ్‌మేట్. బీఎస్ఎఫ్ చీఫ్‌గా రాకేష్ అస్తానా.. వచ్చే ఏడాది జులై 31వ తేదీ వరకు కొనసాగుతారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా అస్తానా పనిచేశారు. ఆ సమయంలోనే అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మతో విభేదాలు తలెత్తాయి. సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో అస్తానా, అలోక్ వర్మ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

ఈ అవినీతి ఆరోపణల అనంతరం అస్తానాను ప్రభుత్వం తొలగించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇప్పటికీ అస్తానాపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రానికి చెందిన రాకేష్ అస్తానాకు భారతీయ జనతా పార్టీ నేతలకు అత్యంత ఆప్తుడిగా పేరు ఉందంటూ తరచూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసేవారు. అలాంటి అధికారిని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

English summary
The Centre on Monday appointed Gujarat cadre IPS officer Rakesh Asthana as the new director general of the Border Security Force (BSF), according to an official order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X