వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంతో అమీ తుమీ: నిరవధికంగా రైతు నిరసనలు -టికాయత్ ప్రకటన -సుదీర్ఘ పోరుకు సరంజామా సిద్ధం

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 79వ రోజుకు చేరాయి. దేశరాజధాని ఢిల్లీ శివారులుల్లో వివిధ రాష్ట్రాల సరిహద్దుల వద్ద వేలాది మంది రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతు సంఘాలు, ప్రభుత్వానికి మధ్య చర్యలు నిలిచిపోయాయి. పార్లమెంటులో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు రైతు ఉద్యమంపై వాదులాడుకున్నాయి. చట్టాలను రద్దు చేసుకోబోమమి మోదీ సర్కారు దాదాపుగా తెగేసి చెప్పడంతో రైతులు ఇంకాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు..

కు.ని. నినాదంతో మోదీకి కౌంటర్ -3ముక్కలు, 2పేర్లలో సాగు చట్టాలు -రాహుల్ సంచలనం -శ్రద్ధాంజలికు.ని. నినాదంతో మోదీకి కౌంటర్ -3ముక్కలు, 2పేర్లలో సాగు చట్టాలు -రాహుల్ సంచలనం -శ్రద్ధాంజలి

సాగు చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనలను నిరవధికంగా కొనసాగిస్తామని 'భారతీయ కిసాన్‌ యూనియన్‌' (బీకేయూ) ప్రధాన కార్యదర్శి, అధికారిక ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ వెల్లడించారు. నిరసనలు ఎంతకాలం కొనసాగించాలనే వ్యవధిపై నిర్ణయమేదీ తీసుకోలేదని.. ఇవి అక్టోబర్‌ వరకూ కొనసాగవచ్చని ఆయన తెలిపారు.

 Rakesh Tikait warns farmers protest will go on for indefinite period, Farmers improve facilities

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు అమోదయోగ్యం కావని, వాటిని రద్దు చేయకపోవటం వెనుక ఉన్న కారణాలేంటో కేంద్రమే వివరించాలని టికాయత్ డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున రైతు నిరసన ప్రదర్శనలు చేపడతామని ప్రకటించారు. కాగా, రైతు నిరసనలపై పార్లమెంటులో చర్చ జరగటంపై టికాయత్‌ హర్షం వ్యక్తం చేశారు..

అయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలిఅయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలి

బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రైతుల నిరసనలపై సంచలన ప్రసంగం చేయడం, ప్రధాని మోదీ తన దగ్గరి వ్యక్తులైన ఇద్దరు పెట్టుబడిదారుల కోసమే సాగు చట్టాలను రూపొందించారని, దేశాన్ని నడిపిస్తోంది నలుగురే అన్న రాహుల్‌ వ్యాఖ్యలతో రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ ఏకీభవించారు. తమ ప్రదర్శన అక్టోబర్‌ వరకూ కొనసాగుతుందని.. మరో రైతు సంఘం 'సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా' నేత గుమ్‌నాబ్‌ సింగ్‌ కూడా ఇదివవరకు పేర్కొన్నారు. కాగా,

సాగుచట్టాలపై పోరు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేకపోవడం, నిరవధికంగా సాగుతుందని నేతలే ప్రకటించిన దరిమిలా.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న దీక్షా స్థలాల వద్ద ఆ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింఘూ సహా పలు సరిహద్దుల్లో ఉన్న రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను, సౌకర్యాలనూ రైతు సంఘాలు పెంచుకున్నాయి. టన్నుల కొద్దీ నిత్యావసరాలు, గ్యాస్, మొబైల్ టాయిలెట్లు తదితరాలను రైతులు సమకూర్చుకున్నారు.

English summary
Bhartiya Kisan Union (BKU) spokesperson Rakesh Tikait on Friday said the ongoing farmers' protest will go on for indefinite period as there is no planning regarding the duration yet. "Farmers' protest will go on for indefinite period as there is no plan currently. It might continue till October," Tikait told ANI. Farmers improve facilities, infrastructure to prepare for prolonged protest at Singhu border
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X