వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా జెండాలతో ఆసక్తికరంగా ట్రంప్ పర్యటన... ఏకిపారేస్తున్న రామ్ గోపాల్ వర్మ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు . ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారతీయులు అమెరికా, ఇండియా జెండాలు పట్టుకుని వారు ఇరువురికీ స్వాగతం పలుకుతున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి మోతేరా క్రికెట్ స్టేడియం 22 కిలోమీటర్ల మేరట్రంప్, ప్రధాని మోదీ రోడ్‌ షో ఉంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

Recommended Video

Ram Gopal Varma Mocks Trump Claim || Oneindia Telugu

ట్రంప్ 36 గంటల పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏం లేదు, ట్రంప్-మోడీపై 'సామ్నా’లో శివసేన ఫైర్ట్రంప్ 36 గంటల పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏం లేదు, ట్రంప్-మోడీపై 'సామ్నా’లో శివసేన ఫైర్

ట్రంప్ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లపై విమర్శలు

ట్రంప్ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లపై విమర్శలు


అలాగే దాదాపు 35 నిమిషాల పాటు ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో అడుగడుగునా స్వాగతం పలికేలా హోర్డింగులు, ప్లకార్డులు, స్టేజీలపై నృత్యాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అమెరికా, ఇండియా జెండాలను పట్టుకుని ట్రంప్ కు స్వాగతం పలుకుతున్నారు భారతీయులు . ఇక ఇదే సమయంలో ట్రంప్ పర్యటన నేపధ్యంలో అట్టహాసంగా సాగుతున్న ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రంప్ పర్యటనను టార్గెట్ చేసిన రాం గోపాల్ వర్మ

ట్రంప్ పర్యటనను టార్గెట్ చేసిన రాం గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ పై సెటైర్లు వేశారు. మొన్నటికి మొన్న ట్రంప్ అహ్మదాబాద్ లో తనకు కోటి మంది స్వాగతం పలుకుతారని వ్యాఖలు చేసిన నేపధ్యంలో అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, సన్నీ లియోన్ వంటి వారు కూడా ట్రంప్ తో కలిసి వస్తే అప్పుడు కోటి మంది వస్తారేమో అని సెటైర్ వేశారు. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ టూర్ పై మరోసారి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ట్రంప్ పర్యటనకు ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్న

ట్రంప్ పర్యటనకు ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్న

అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వర్మ ట్వీట్ చేసారు. ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం కానీ ప‍్రధాని నరేంద్ర మోడీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా..? అని ప్రశ్నించారు. అంతే కాదు అది అమెరికా భారత్‌ కాదు అంటూ తనదైన శైలిలో వర్మ ట్వీట్ చేశారు . ఇక అంతే కాదు ట్రంప్ ఇండియాకు రావటానికి గల కారణం కూడా చెప్పారు వర్మ .

 ట్రంప్ తన గొప్పలు చెప్పుకోటానికే ఇండియా టూర్ అన్న వర్మ

ట్రంప్ తన గొప్పలు చెప్పుకోటానికే ఇండియా టూర్ అన్న వర్మ

ఇక మరో ట్వీట్ లో ట్రంప్‌ ఇండియాకు రావడానికి ఒకే ఒక కారణం ఉందని పేర్కొన్నారు. తను ఇండియా వస్తున్నాడంటే ఎంత మంది అతన్ని చూడటానికి వస్తారో అని తెలుసుకోవడానికి వస్తున్నాడు . ఎందుకంటే దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చు.తన కోసం 10 మిలియన్ల మంది వస్తే ట్రంప్‌ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

 పర్యటనకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ట్రంప్ చూస్తారా ?

పర్యటనకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ట్రంప్ చూస్తారా ?

భారతీయులే మన సాంసృతిక కార్యక్రమాలను చూడరు అలాంటిది ట్రంప్ ను ఎవరు చూస్తారు దీని కంటే ఓ బాలీవుడ్‌ నైట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం మంచిది అని వర్మ ఎద్దేవా చేశారు. మొత్తానికి ఇండియాలో ట్రంప్ పర్యటన, ఆయన పర్యటన నేపధ్యంలో ఇండియాలో చేస్తున్న హడావిడి కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే కొందరికి అసహనం కలిగిస్తుంది. ఇక వివాదాస్పద దర్శకుడు వర్మ మాత్రం ట్రంప్ పర్యటనపై తనదైన సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు.

English summary
Ram gopal Varma tweeted that Prime Minister Modi had made special arrangements in the wake of the US President's coming to India. We have spent thousands of dollars on inviting Trump to India. Varma tweeted in his own style that they spend thousand rupees for modi's visit to america. Varma also said the reason for Trump's visit to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X