దీపికా పదుకునే కంటే కేజ్రీవాలే హాట్.. : ట్విట్టర్లో వర్మ సెటైర్స్
ముంబై : తెరపై సంచలనాత్మక కథలు.. ట్విట్టర్ లో వివాదస్పద వ్యాఖ్యలు.. గత కొన్నాళ్ల నుంచి వర్మ తీరు ఇది. ఎప్పుడు ఎవరి మీద కౌంటర్ వేస్తాడో.. ఎవరిని పొగడ్తల్లో ముంచెత్తుతూ కామెంట్ చేస్తాడో.. ఎవరికి అర్థంకాదు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై పడ్డాడు రామ్ గోపాల్ వర్మ.
ఈరోజు చిల్డ్రన్స్ డే కావడంతో.. హ్యాపీ చిల్డ్రన్స్ డే కేజ్రీవాల్ అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు వర్మ. చిల్డ్రన్స్ అంటే.. చిన్న పిల్లలకు సంబంధించిందన్న సంగతి తెలిసిందే. అంటే.. తన ట్వీట్ ద్వారా కేజ్రీవాల్ ను పరోక్షంగా చిన్నపిల్లాడంటూ సంబోధించాడన్నమాట.
Wow dint know there's such killer look behind the muffler..Intensity in this pic of @ArvindKejriwal is looking hotter than Deepika Padukone pic.twitter.com/okAvFZzcNZ
— Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2016
అయితే వర్మ ట్విట్స్ ఎటాక్ కు అక్కడితో తెరపడలేదు. ఆ వెంటనే మరో ట్విట్ లో 'మఫ్లర్ వెనకాల ఇలాంటి కిల్లర్ దాగున్నాడా? ఫోటోలో తీవ్రత చూస్తుంటే.. దీపికా పదుకునే కంటే హాట్ గా కనిపిస్తున్నారు' అంటూ ట్వీట్ చేసిన వర్మ.. తీవ్ర ఆగ్రహంతో పేపర్స్ తగలబెడుతున్న కేజ్రీవాల్ ఫోటో ఒకటి ట్విట్టర్ లో పెట్టారు.
Happy Children's Day to @ArvindKejriwal
— Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2016
ఇక కేజ్రీవాల్ పై వర్మ చేసిన ట్వీట్ కు నెటిజెన్స్ నుంచి కూడా సెటైర్స్ తోడవుతున్నాయి. కేజ్రీవాల్ దేశంలోనే అతిపెద్ద కంప్లెయింట్ బాక్స్ అంటూ ఓ నెటిజెన్ ట్విట్ చేస్తే.. ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని మరిచిపోయారా? అంటూ మరో నెటిజెన్ సైటైరికల్ ట్వీట్స్ చేశారు. ఏదేమైనా వర్మ ట్విట్టర్ ఖాతాలో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా బాధితుడిగా మారిపోయరన్నమాట.