వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్ పిటిషన్: జయను రాంజెఠ్మలాని రక్షిస్తారా..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలు జయలలిత నేడు బెంగళూరు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో జయలలిత కోరారు. నేటి నుంచి హైకోర్టుకు సెలవులు ఉండటంతో ప్రత్యేక బెంచ్‌లో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 29 నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు బెంగుళూరు హైకోర్టుకు సెలవులు ఉన్నందున మంగళవారం వేకేషన్ బెంచ్ మందుకు ఈ బెయిల్ పిటిషన్ రానుంది. బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు వెళ్లాలని ఆదివారమే ఓ నిర్ణయానికి వచ్చిన జయలలిత, సీనియర్ కౌన్సిల్ బి.కుమార్ ఆధ్వర్యంలో న్యాయనిపుణుల బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందు కోసం ఈ బృందం కసరత్తు మొదలుపెట్టింది.

Ram Jethmalani to repeat history, likely to defend jailed Jayalalithaa in court

శనివారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సేకరించి హైకోర్టులో సమర్పించారు. జయలలితకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలాని సోమవారం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసిన్నట్లు అన్నాడీఎంకే వర్దాలు వెల్లడించాయి.

గతంలో టాన్సీ భూముల కుంభకోణంలోనూ జయలలితకు రాంజెఠ్మలాని బెయిల్ వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్లకు మించి జైలు శిక్ష పడిన వారికి హైకోర్టు మాత్రమే బెయిల్ మంజారు చేస్తుంది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన ఎంపీ, ఎమ్మేల్యేలు పదవికి దూరమవుతారని గత ఏడాది అత్యున్నత న్యాయస్దానం సుప్రీం కోర్టు ఒక తీర్పులో వెల్లడించింది.

English summary
Senior advocate Ram Jethmalani, who always takes up controversial cases, once again may shock everyone. AIADMK sources informed that Jethmalani is likely to represent Jayalalithaa in higher court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X