వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్, ఏపీలో ఒక్క ఓటు కూడా దక్కించుకోని మీరా కుమార్

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. కోవింద్ కు 65.65 శాతం ఓట్లు( 7,02,644 ఓట్లు ) లభించాయి. ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. కోవింద్ కు 65.65 శాతం ఓట్లు( 7,02,644 ఓట్లు ) లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ కు 34.35 శాతం ఓట్లు ( 3,67,314 ఓట్లు ) లభించాయి. ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గురువారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి రౌండు నుంచే రామ్‌నాథ్‌ కోవింద్‌ తన ప్రత్యర్థి మీరా కుమార్ పై అధిక్యంలో కొనసాగారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్ నాయకులు, మమతా బెనర్జీ అభినందించారు.

Ram Nath Kovind has won the presidential election.. No votes polled for Meira in AP

ఓటమి అనంతరం.. తాను సైద్ధాంతిక పోరాటం సాగించినట్లు మీరా కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ గెలుపు తరువాత కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ సాగింది. తొలుత పార్లమెంట్‌ భవన బ్యాలెట్‌ పెట్టెను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ క్రమంలో రాష్ట్రాల వారీగా బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి లెక్కించారు.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్‌ నమోదైంది. మీరా కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా పోలవలేదు.

అధికార ఎన్డీయే తరఫున బిహార్‌ మాజీ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌.. 18 విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు జేడీయూ, తెరాస, అన్నాడీఎంకే తదితర మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కోవింద్‌కే మద్దతిచ్చాయి.

రాష్ట్రాల వారీగా పోలైన ఓట్లు...

ఉత్త‌ర ప్ర‌దేశ్: కోవింద్ -335 ఓట్లు, మీరా కుమార్- 65 ఓట్లు, 2 చెల్ల‌ని ఓట్లు
ఢిల్లీ: కోవింద్ - 6, మీరా కుమార్ - 55, 6 చెల్ల‌ని ఓట్లు
పుదుచ్చేరి: కోవింద్ - 10, మీరా కుమార్ - 19, 1 చెల్ల‌ని ఓటు
నాగాలాండ్: కోవింద్ - 56, మీరా కుమార్ - 1, 2 చెల్ల‌ని ఓట్లు
రాజ‌స్థాన్: కోవింద్ - 166, మీరా కుమార్ - 34
గోవా: కోవింద్ - 25, మీరా కుమార్ 11
మ‌హారాష్ట్ర: కోవింద్ - 208, మీరా కుమార్ - 77, 2 చెల్ల‌ని ఓట్లు
ఉత్త‌రాఖండ్: కోవింద్- 59, మీరా కుమార్ - 11
పంజాబ్: కోవింద్ - 18, మీరా కుమార్ - 95, 3 చెల్ల‌ని ఓట్లు
ఒడిశా: కోవింద్ 127, మీరా కుమార్ - 16, 2 చెల్ల‌ని ఓట్లు
గుజ‌రాత్: కోవింద్ 132, మీరా కుమార్ - 49
హ‌ర్యానా: కోవింద్ 73, మీరా కుమార్ 16
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్: కోవింద్ 448, కుమార్ 24
ఆంధ్రప్రదేశ్‌ : కోవింద్ - 27189, మీరా కుమార్ - 0
అసోం: కోవింద్ - 10,556, మీరా కుమార్ - 4,060
బిహార్‌ : కోవింద్ - 22,940, మీరా కుమార్ - 18,867
హిమాచల్‌ ప్రదేశ్‌: కోవింద్ - 1530, మీరా కుమార్ - 1887
జమ్ముకశ్మీర్‌: కోవింద్ - 4,032, మీరా కుమార్ - 2160

English summary
President Election Result 2017 LIVE: Ram Nath Kovind Wins, Will Be 14th President Of India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X