వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు

డేరా బాబాపై 19 గిన్నిస్ రికార్డులున్నాయి.రక్తదానం, మొక్కల పెంపకంపై రికార్డులుఅత్యాచార కేసులో సిబిఐ కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పేరు 19 గిన్నిస్‌బుక్ రికార్డులున్నాయి.

2003 నుండి 2015 మధ్య కాలంలో ఈ 19 గిన్నిస్‌బుక్ రికార్డులు నమోదయ్యాయి. 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేశారు.15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి రక్తదానం చేయడంతో ఆయన ఈ రికార్డును నమోదు చేశారు.

Ram Rahim has 19 Guinness world records to his credit, which is a record in itself

2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులను నమోదు చేశారు.

2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డును సృష్టించాడు. దీనితో పాటుగా 4,603 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే క్యాంపును ఏర్పాటుచేసి రికార్డు క్రియేట్ చేశారు రామ్‌రహీమ్‌సింగ్.

వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, షుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌తో డేరా బాబా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందారు.

కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి.

కానీ, అనుహ్యంగా ఆయనపై అత్యాచార కేసు నమోదు కావడం, ఆ కేసులో సిబిఐ కోర్టు దోషిగా శుక్రవారం నాడు తేల్చింది.

English summary
Controversial godman Ram Rahim was convicted of rape today. His Dera Sacha Sauda boast of several achievements. One of them is bagging as many as 19 entries in the coveted Guinness World Record.The world records range from varied activities such as creating world's largest vegetable mosaic to organising largest eye screening camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X