వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామసేతు సత్యం: అమెరికా ఛానల్ స్పెషల్ రిపోర్ట్, నాసా ఫొటోలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

రామసేతు మానవ నిర్మితం అంట ?

వాషింగ్టన్/న్యూఢిల్లీ: రామాయణంలో కీలక ఘట్టం రామసేతు. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లి శ్రీలంకలో బంధించగా.. ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు.. హనుమంతుడు, వానరసేన సాయంతో శ్రీలంకకు రామసేతును నిర్మించిన విషయం తెలిసిందే. ఈ విషయం రామాయణం తెలిసిన ప్రతీ వ్యక్తికి తెలుసు. కాగా, ఇప్పుడు అమెరికాకు చెందిన ఓ ఛానల్.. రామసేతు వాస్తవంగానే నిర్మించారని స్పష్టం చేసింది.

ఇప్పటివ వరకు కూడా రామాయణం పుక్కిట పురాణం అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ ఛానల్ నివేదికతో రామాయణం నిజంగానే జరిగిందని, రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తేలింది.

రామసేతుపై ప్రత్యేక కథనం..

రామసేతుపై ప్రత్యేక కథనం..

భారత్‌-శ్రీలంకలను కలుపుతూ.. రామాయణ కాలంలో వారధి నిర్మించారని.. ఇది సత్యమేనని ఆ ఛానల్‌ తెలిపింది. డిస్కవరీ కమ్యూనికేషన్‌కు చెందిన సైన్స్‌ ఛానల్‌ రామసేతు గురించి ప్రత్యే కథనాన్ని ప్రసారం చేసింది.

అంతర్జాతీయ జలాల్లో నిర్మాణం

అంతర్జాతీయ జలాల్లో నిర్మాణం

‘భారత్‌-శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి.. పూర్తిగా సున్నపురాయి (లైమ్‌స్టోన్‌)తో నిర్మించింది. తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి... శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్‌ ప్రాంతం వరకూ ఈ వారధిని నిర్మించారు' అని పేర్కొంది.

నీళ్ల మీద తేలిన రాళ్లు..

నీళ్ల మీద తేలిన రాళ్లు..

వారధి నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు.. నీటి మీద తేలుతూ.. ఇసుక శక్తితో ధృఢంగా నిలిచాయని చెప్పారు. సైన్స్‌ ఛానల్‌ ఈ కథనం కోసం ప్రత్యేకంగా వారధి గురించి దాదాపు 30 మైళ్ల దూరం వరకూ సైంటిస్టులు పరిశోధనలు చేశారు.

రామసేతు సత్యం

ఈ పరిశోధనల్లోనే ఈ ఆసక్తిర విషయంల వెలుగు చూసినట్లు పేర్కొంది. భారత్‌-శ్రీలంకను కలుపుతూ.. నిర్మించిన రామసేతు.. ఇటు శాస్త్రపరిశోధనలు, అటు హిందూ విశ్వాసాల పరంగా చూసినా సత్యమేనని సైన్స్‌ ఛానల్‌ స్పష్టం చేసింది. కాగా, రామసేతుకు సంబంధించిన పలు ఫొటోలను నాసా కూడా విడుదల చేయడం గమనార్హం.

English summary
Ram Setu does exist and it is man made a television channel in the United States has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X