వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో రేపటి నుంచి రామాలయ నిర్మాణం- సర్వం సిద్ధం చేసిన ట్రస్ట్-దర్శనాలు ప్రారంభం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా హిందువులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి ప్రాంతంలో రామ మందిర నిర్మాణం బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం ట్రస్టు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన దర్శనాలను కూడా నిన్నటి నుంచి పునరుద్ధరించారు.

ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డ్యాం , రెండు కాలవలు తవ్వటమా : టీడీపీ నేతలపై మంత్రి అనీల్ ఫైర్ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డ్యాం , రెండు కాలవలు తవ్వటమా : టీడీపీ నేతలపై మంత్రి అనీల్ ఫైర్

గతేడాది సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును అనుసరించి ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో ఉన్న రామజన్మభూమి ప్రాంతంలో ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు రేపు ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది. ముందుగా ఉదయం 8 గంటలకు కుబేర్ తిల విగ్రహం వద్ద ప్రధాన అర్చకుడు మహంత్ కమల్ నయన్ దాస్ తో పాటు ఇతర అర్చకులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకం ఉంటుంది. దాదాపు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ తర్వాత మహా ఆలయ నిర్మాణానికి పునాది రాళ్లు వేయనున్నట్లు ట్రస్టు వర్గాలు ప్రకటించాయి.

ram temple construction in ayodhya to begin on tomorrow

Recommended Video

Vizag Gas Leak: High-Power Committee Meets Villagers, Political Parties

రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ అక్కడ ఉన్న రామ్ లల్లా, ఇతర దేవతా విగ్రహాలను అక్కడి నుంచి సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించనున్నారు. విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి తరలిస్తారు. తిరిగి నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని మందిరంలో ప్రతిష్టించనున్నారు.

English summary
The construction of the Ram temple in Ayodhya is set to begin on Wednesday when the first bricks will be laid for its foundation. According to Supreme Court's historic verdict trust had handed over the area and will start the work from tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X