వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు కూల్చిన రోజే... రామ మందిరం నిర్మాణం : ఎంపీ సాక్షి మహారాజ్

|
Google Oneindia TeluguNews

గత నలబై రోజులుగా అయోధ్య వివాదంపై గత నెలరోజులుగా సుప్రింకోర్టు ప్రత్యేక ధర్నాసనం వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. వాదలపై నవంబర్ 27 వరకు తీర్పును వెలువరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ రామమందిర నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చిన డిశంబర్ ఆరవ తేదీ నుండి తిరిగి రామమందిర నిర్మాణం చేపడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఎంపీ సాక్షి మహారాజ్‌ ప్రకటించారు. బుధవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడారు.. 1992 డిసెంబర్‌ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. వాదనలు ముగిసిన రోజే ఆయన ఈ కామెంట్స్ చేయడంతో సంచలనం రేగాయి.

Ram temple construction will begin from December 6 :MP Sakshi Maharaj

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమవుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని సాక్షి మహారాజ్ పిలుపునిచ్చారు. బాబర్‌ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్‌ బోర్డు అంగీకరించాలన్నారు . రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే మందిర నిర్మాణం ద్వార దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు.

English summary
Bharatiya Janata Party(BJP) MP Sakshi Maharaj has announced that Ram temple construction will begin in Ayodhya from December 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X