వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏకు షాకిస్తారా?: ఆస్పత్రిలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్: కొడుకు నిర్ణయానికే మద్దతు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు అనారోగ్య కారణాలతో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఇకపై లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) బాధ్యతలను తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చూసుకుంటారని ఆయన వెల్లడించారు.

అంతేగాక, బీహార్ అసెంబ్లీ ఎన్నికలలలో పొత్తులపై కూడా చిరాగ్ నిర్ణయమే ఫైనల్ అని రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ.. కూటమి నుంచి తప్పుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Ram Vilas Paswan Reveals He is Hospitalised, Backs Son Chirag to Take Alliance Call for Bihar Polls

కాగా, తాను కేంద్ర ఆహార మంత్రిగా నిరంతరం దేశానికి సేవచేస్తున్నట్లు రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. విధుల్లో భాగంగా కరోనా మహమ్మారి సంక్షోభం ఉన్నప్పటికీ తాను దేశంలో పలు ప్రాంతాలను పర్యటిస్తున్నానని తెలిపారు. అనారోగ్య కారణాలతో తాను అప్పుడప్పుడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా బాగా క్షీణించడంతో తాను ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. అయితే, తన అనారోగ్యానికి కారణం మాత్రం ఆయన తెలపలేదు. గతంలో ఆయన గుండె సంబంధిత సమస్యలతో పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఈ పరిస్థితిలో తన కుమారుడు తనతో ఉండటం సంతోషంగా ఉందని రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఇక నుంచి తనతోపాటు పార్టీని కూడా చిరాగ్ పాశ్వాన్ చూసుకుంటారని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై తన కుమారుడు చిరాగ్ ఏ నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని రాంవిలాస్ తెలిపారు. పార్టీని, బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేస్తుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
నితీష్ కుమార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్.. తన సొంత ఇమేజ్‌ను పెంచుకునే యత్నం చేస్తున్నారు. అంతేగాక, పలుమార్లు నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా కూడా గళం ఎత్తుతున్నారు. సెప్టెంబర్ 15న జరిగే పార్టీ సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్జేపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనుకుంటూ ఎవరూ ఆపరని జేడీయూ నేతలు తేల్చిచెబుతున్నారు.

English summary
Ram Vilas Paswan Reveals He is Hospitalised, Backs Son Chirag to Take Alliance Call for Bihar Polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X