వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవీ ముంబై తరహాలో..నవ బెంగళూరు: రామనగరను తీర్చిదిద్దే దిశగా: రాజుకున్న రాజకీయ వేడి..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రామనగర. బెంగళూరుతో పరిచయం ఉన్న వారికి చిరపరిచితమైన పేరు ఇది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా. రాజకీయ దురంధరులను అందించిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ గా ఉన్న ఈ జిల్లాను నవ బెంగళూరుగా తీర్చిదిద్దే దిశగా అధికార భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రామనగర అనే పేరును తొలగించి.. నవ బెంగళూరు అని కొత్తగా నామకరణం చేయడానికి త్వరలోనే ఓ నోటిఫికేషన్ వెలువడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

నవీ ముంబై తరహాలో..

దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబై మహానగరం పరిధిని విస్తృతం చేసిన తరువాత.. దానికి నవీ ముంబైగా అభివృద్ధి చేసింది అక్కడి ప్రభుత్వం. అదే ఫార్ములాను అనుసరించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అందాయని చెబుతున్నారు. రామనగర జిల్లాను విభజించి, దక్షిణ ప్రాంతానికి పాత పేరును కొనసాగించడం, బెంగళూరుకు ఆనుకుని ఉన్న గ్రామాలు, ఇతర ప్రాంతాలను కలిపి నవ బెంగళూరుగా తీర్చిదిద్దేలా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.

పెట్టుబడుల కోసమే..

పెట్టుబడుల కోసమే..

ప్రస్తుతం బెంగళూరు జనసాగరంలా తయారైంది. వాహనాల రాకపోకలు స్తంభించడం, ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం అయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరాలంటే.. గంటల పాటు సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తోందనే ఆవేదన బెంగళూరువాసుల్లో చాలాకాలం నుంచే వ్యక్తమౌతోంది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడం, మెట్రో రైలు సౌకర్యం ఉన్నప్పటికీ.. ఆశించిన ఫలితాలు దక్కకపోవడం వల్ల పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు.

నవ బెంగళూరుగా రామనగర..

ఈ పరిస్థితుల్లో రామనగర జిల్లాను నవ బెంగళూరుగా తీర్చిదిద్దడం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పర్యాటక కేంద్రాలు పెద్ద ఎత్తున ఉండటం వల్ల ఆ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు ఉంటుందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. సిలికాన్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరుకు గుర్తింపు ఉన్నందున.. రామనగర పేరును తొలగించి, నవ బెంగళూరుగా మార్చడం వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది.

బెంగళూరు పేరును మార్చొద్దు..

బెంగళూరు పేరును మార్చొద్దు..

కాగా- ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగును పులుముకుంది కూడా. రామనగర పేరును మార్చే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి స్పష్టం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న జిల్లా పేరును మార్చడాన్ని అనుమతించబోనని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రామనగర పేరును తొలగించే సాహసానికి పూనుకోవద్దంటూ ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా యడియూరప్ప ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి.

English summary
According to local reports, the state government may soon change the name of Ramanagara district to Nava Bengaluru to attract big foreign investments there. State government is now planning to change the name to Nava Bengaluru on the lines of Navi Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X