బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏకాంతంగా ఉంటున్న ప్రేమికులను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి వారి దగ్గర నగలు, నగదు లూటీ చేస్తున్న నకిలీ పోలీసును కర్ణాటకలోని రామనగర పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని కనకపురకు చెందిన రఘు అనే క్రిమినల్, అతని స్నేహితుడు రవీశ్ అనే నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.

లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి !లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి !

నేను సీసీబీ పోలీసు

నేను సీసీబీ పోలీసు

బెంగళూరు గ్రామీణ, రామనగర, రామనగర గ్రామీణ, బిడిది, కుంబళగూడు, కగ్గలీపుర, నైస్ రోడ్డు ప్రాంతాల్లో ఒంటరిగా వెలుతున్న ప్రేమికులను, ఏకాంతంగా ఉంటున్న ప్రేమికులను గుర్తించిన రఘు వారి దగ్గరకు వెళ్లి తాను సీసీబీ పోలీసు అని బెదిరిస్తున్నాడు.

లవర్స్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్

లవర్స్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్

నిర్జనప్రదేశంలో మీరు ఏం చేస్తున్నారని, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తే మీ కుటుంబం పరువుపోతుందని రఘు ప్రేమికులను బెదిరించాడు. హైవే ప్రాంతాలు, నైస్ రోడ్డులో వాహనాలు నిలిపి మాట్లాడుతున్న ప్రేమికుల ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడుతామని, తరువాత మీ కుటుంబం పరువు పోతుందని రఘు, అతని స్నేహితుడు రవీశ్, మరో నిందితుడు బెదిరించారు.

ధైర్యం చేసిన ప్రేమికులు

ధైర్యం చేసిన ప్రేమికులు

ప్రేమికులను కేసులు, జైళ్లు అని బెదిరించిన రఘు వారి దగ్గర ఉన్న బంగారు నగలు, నగదు, విలువైన మొబైల్ ఫోన్లు లూటీ చేసి పారిపోతున్నాడు. ఇలాంటి కేసులు ఎక్కువ కావడం, కొందరు యువతీ యువకులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు గాలించి నకిలీ పోలీసు రఘు, అతనికి సహకరిస్తున్న రవీశ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మీరు ఏం చెయ్యాలంటే: ఎస్పీ

మీరు ఏం చెయ్యాలంటే: ఎస్పీ

రఘు, రవీశ్ కు సహకరిస్తున్న మరో నిందితుడు పారిపోయాడని, ఎవరైనా పోలీసులు అని బెదిరిస్తే నగదు, నగలు ఇవ్వకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలని రామనగర జిల్లా ఎస్పీ అనూప్ శెట్టి మనవి చేశారు. రఘు అతని స్నేహితులు ఎంత మందిని నకిలీ పోలీసుల ముసుగులో ఇలా మోసం చేశారు అని పోలీసులు ఆరాతీస్తున్నారు.

English summary
Karnataka: Ramanagar police have arrested a man who rob money and jewellery from lovers by threaten them in the name of CCB police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X