వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూరదర్శన్‌లో రామాయణం డీవీడీ వేస్తున్నారా..? ఇదేం విడ్డూరం: సీఈఓ ఏం చెప్పారంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. భారత్‌ కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అంతా క్వారంటైన్ అయ్యారు. ఇకఇళ్లకే పరిమితమైన ప్రజలంతా హ్యాపీగా టీవీలో వస్తున్న కార్యక్రమాలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ముఖ్యంగా 80, 90 దశకాల నాటి రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను తిరిగి దూరదర్శన్ టెలికాస్ట్ చేస్తుండటంతో ఆనాటి మెగా సీరియల్‌ను ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు దూరదర్శన్ చేస్తున్న టెలికాస్ట్‌పై అసంతృప్తితో ఉన్నారు.

లాక్‌డౌన్ సమయంలో టీవీ కార్యక్రమాల్లో అత్యధిక రేటింగ్‌లను సంపాదించుకుంది అలనాటి రామాయణం, మహాభారతం సీరియల్స్. 1980,90వ దశకాల్లో చూపరులను కట్టిపడేసిన రామాయణం మహాభారతం లాంటి మెగా సీరియల్స్ ఇప్పుడు కూడా అదే స్థాయిలో రేటింగ్స్‌లో దూసుకెళుతున్నాయి. ఇప్పుడు క్వారంటైన్ పిరియడ్‌లో ఈ మెగా సీరియల్స్ దుమ్మురేపుతున్నాయి. ఇదిలా ఉంటే దూరదర్శన్ టెలికాస్ట్ చేస్తున్న ఈ సీరియల్ వీడియో క్వాలిటీ పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీక్షకులు నేరుగా దూరదర్శన్‌లో చూడకుండా ఇతర ప్లాట్‌ఫాంలపై ఈ సీరియల్‌ను వీక్షిస్తున్నారు. ఇందుకు కారణం దూరదర్శన్ టెలికాస్ట్ చేస్తున్న వీడియో క్వాలిటీతో లేదనేది వీక్షకుల అభిప్రాయం.

ఇక దూరదర్శన్ టెలికాస్ట్ చేస్తున్న రామాయణం, మహాభారతం సీరియళ్ల వీడియో క్వాలిటీ సంతృప్తికరంగా లేదని వీక్షకులు చెబుతున్నారు. అదేదో మోసర్ బేర్ డీవీడీ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారనే ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు కొందరు. అయితే అలాంటి ఆరోపణలను కొట్టిపారేశారు ప్రసార్ భారతి సీఈఓ శశిశేఖర్. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు శశిశేఖర్ సమాధానం ఇచ్చారు. వీడియో దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయినట్లు లేదని మరో సోర్స్ నుంచి వీడియో టెలికాస్ట్ అయినట్లు ఉందని అన్నారు శశిశేఖర్. ఒకసారి సోర్స్‌ను చెక్క చేసుకోవాలని సూచించారు.

Ramayan being streamed from Moser Baer DVDs’, alleges netizen,Here is the reply from DD CEO

సౌండ్ క్వాలిటీపై కూడా సమాధానం ఇచ్చారు శశిశేఖర్. డైలాగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే ఎక్కువగా ఉందని ఓ వ్యక్తి చెప్పారు. చాలా చోట్ల ఇదే ఉందని చెప్పిన వ్యక్తి దీన్ని త్వరగా ఫిక్స్ చేయండంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా ఒకసారి ఎక్కడి నుంచి ఆ వీడియోను వీక్షిస్తున్నారో చెక్ చేసుకోండంటూ శశి శేఖర్ చెప్పారు.

ఇదిలా ఉంటే దూరదర్శన్‌లో తిరిగి టెలికాస్ట్ అవుతున్న రామాయణం మహాభారతం సీరియల్స్‌కు ఏప్రిల్ 3న విడుదల చేసిన బార్క్ రేటింగ్స్‌లో అత్యధిక రేటింగ్స్ ఈ మెగా సీరియల్స్‌కే దక్కడం విశేషం. వ్యూయర్‌షిప్‌లో దాదాపు 40వేల శాతం అధికంగా రావడం విశేషమని బార్క్ తెలిపింది. ఇక రామాయణం మహాభారతంతో పాటు 90వ దశకాల్లో టెలికాస్ట్ అయి చూపరులను ఆకట్టుకున్న శక్తిమాన్, బునియాద్‌లాంటి సీరియల్స్‌ను తిరిగి టెలికాస్ట్ చేస్తోంది. ఒకప్పుడు దేశాన్ని ఉర్రూతలూగించిన దూరదర్శన్‌లో ఈ సీరియల్స్ టెలికాస్ట్ అయ్యాయి.

English summary
Perhaps in a replay of its glory days in the 80s and 90s, India’s national broadcaster Doordarshan is enjoying a surge in ratings and popularity as India stays in lockdown to control the spread of coronavirus pandemic. Indians are switching on the classic Ramayan and Mahabharat as the mythologies are being telecast once again during the quarantine period
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X