వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలె చెంపపై కొట్టిన యువకుడు, బంద్‌కు పిలుపు

|
Google Oneindia TeluguNews

ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఏ) అధ్యక్షులు రామ్‌దాస్ అథవాలే పైన ఓ దుండగుడు దాడి చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అంబర్‌నాథ్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో అథవాలే పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా ఆయనకు చేదుఅనుభవం ఎదురైంది.

హఠాత్తుగా కేంద్రమంత్రి వైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. వెంటనే తేరుకున్న ఆయన అనుచరులు ఆగంతుకుడిని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కేంద్రమంత్రిని కొట్టడంతో అతని అనుచరుల అతనిపై దాడి చేసారు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.

అథవాలే పైన ప్రవీణ్ ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ దాడి విషయం తెలియడంతో అథవాలే అభిమానులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగిందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రిపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.

Ramdas Athawale Allegedly Slapped, Pushed By Man In Maharashtra
English summary
A youth pushed and allegedly assaulted Union Minister of State and Republican Party of India (RPI-A) chief Ramdas Athawale at an event in the Ambernath town late on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X