వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాగీకి దెబ్బ: మార్కెట్‌లోకి రాందేవ్ బాబా నూడుల్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురయ్యయాని బాధపడుతున్న తల్లులు ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విదేశీ మ్యాగీ నూడుల్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా స్వచ్ఛమైన ఆటా (గోధమ పండి) తో తయారు చేసిన నూడుల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఈ నూడుల్స్‌ను విడుదల సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ ఈ నూడుల్స్ గోధమ పిండి నుంచి తయారైన విషయాన్ని మరిచిపోకండన్నారు. ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్ల రసాలను ఉత్పత్తి చేస్తున్న తమ సంస్ధ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కొత్తగా ఆటా నూడుల్స్‌ను తయారు చేస్తుందన్నారు.

 Ramdev launches atta noodles before Maggi returns

ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా పిండిని కలపలేదని, మ్యాగీ నూడుల్స్ స్ధానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇవి ఉంటాయని తెలిపారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో గల హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో రాందేవ్ బాబా ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్‌ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇక మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

English summary
Yoga guru Baba Ramdev on Thursday launched his own brand of noodles - "made from atta, don't forget," he said - even as the leader in the segment, Nestle India, is hoping to return to the Indian markets by the end of the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X