వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో 613 కిలోల భారీ గంట .. రామేశ్వరం నుండి రామజన్మభూమికి .. ఈ గంట ప్రత్యేకత ఏంటంటే

|
Google Oneindia TeluguNews

అయోధ్యలో రామమందిరం కోసం తయారుచేసిన భారీ గంట అయోధ్యకు చేరుకుంది. తమిళనాడులోని రామేశ్వరం నుండి ప్రారంభించిన రామ రథయాత్ర నిన్న సాయంత్రం అయోధ్యలో ముగిసింది. అయోధ్య రామాలయం కోసం తయారుచేసిన 613 కేజీల భారీ గంట 4,555 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు అయోధ్యకు చేరుకుంది. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు మరియు వినాయకుడి ప్రతిమలతో, జైశ్రీరామ్ అక్షరాలు రాసి ఉన్న ఈ గంట అయోధ్యకు చేరుకుంది.

 అయోధ్యకు చేరుకున్న భారీ గంట .. గంట మోగిస్తే 8 నుండి 10 కి.మీ మేర ధ్వని

అయోధ్యకు చేరుకున్న భారీ గంట .. గంట మోగిస్తే 8 నుండి 10 కి.మీ మేర ధ్వని

జైశ్రీరామ్ శ్లోకాల మధ్య ఈ భారీ గంటను ఆలయ ట్రస్టు సభ్యులకు చెన్నైకి చెందిన న్యాయ హక్కుల మండలి ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మండా అందజేశారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం రోజున రామేశ్వరం నుండి బయలుదేరిన రామ రథయాత్రలో భాగంగా ఈ గంటను అయోధ్యకు చేర్చారు.

613 కిలోల భారీ కాంస్య గంట ప్రత్యేకతకు అయోధ్య వాసులు అబ్బుర పడుతున్నారు. ఈ గంటను మోగిస్తే దీని ప్రతిధ్వని 8 నుండి 10 కిలోమీటర్ల వరకు వస్తుందని చెప్తున్నారు.

గంట మోగిస్తే ఓంకారం ప్రతిధ్వని .. ఆలయ నిర్మాణం తర్వాతే గంట ఏర్పాటు

గంట మోగిస్తే ఓంకారం ప్రతిధ్వని .. ఆలయ నిర్మాణం తర్వాతే గంట ఏర్పాటు


సహజంగా గంటను మోగిస్తే టంగ్, టంగ్ అంటూ శబ్దం వస్తుంది. కానీ ఈ గంట మోగిస్తే ఓంకారం ప్రతిధ్వనిస్తుంది అని ఈ గంటను చూస్తున్న ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిపారవశ్యంతో చెప్తున్నారు. రామాలయ నిర్మాణం తర్వాత ఈ భారీ గంటను అమర్చనున్నట్లుగా తెలుస్తుంది.


11 రాష్ట్రాల గుండా 21 రోజుల్లో 4,555 కి.మీ ప్రయాణం చేసిన రామ రథయాత్రలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని, దానిని రామేశ్వరం నుండి రామ్ జన్మభూమి వరకు నడిపించడం తన అదృష్టమని ఈ గంటను ట్రస్టుకు అందించిన రాజ్యలక్ష్మి తెలియజేశారు.

210 కిలోల బరువుతో రామ్ దర్బార్ కు ఐదు విగ్రహాలు

210 కిలోల బరువుతో రామ్ దర్బార్ కు ఐదు విగ్రహాలు

యాత్ర ప్రారంభానికి ముందు రామేశ్వరం వద్ద రామనాథ్ మందిరం ముందు ప్రత్యేక పూజలు చేశామని , ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల కల సాకారం అయినందుకు రామాలయ నిర్మాణం ప్రారంభమైనందుకు ఈ గంటను ట్రస్ట్ కు అందించి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు

. 210 కిలోల బరువుతో రామ్ దర్బార్ యొక్క ఐదు విగ్రహాలను తీసుకువచ్చామని మండా చెప్పారు. రామ రథం నుండి గంటను దింపడానికి భారీ క్రేన్లను ఉపయోగించారు . అయోధ్యలోని ఆలయ ట్రస్ట్ సభ్యులకు అప్పగించారు.

Recommended Video

RRR Is Back In Action, Makers Announce #RAMARAJUFORBHEEM On October 22 | Oneindia Telugu
రామేశ్వరం నుండి రామజన్మభూమికి ..

రామేశ్వరం నుండి రామజన్మభూమికి ..

రామేశ్వరం నగరం నుండి వచ్చిన ఈ గంటకు ఎంతో ప్రాధాన్యత ఉందని, రామేశ్వరం నగరానికి హిందూ పురాణాలలో ప్రత్యేక స్థానం ఉందని చెప్తున్నారు. రాముడు తన వానరసేనతో కలిసి సముద్రం పై వంతెన నిర్మాణం చేసిన ప్రదేశం రామేశ్వరం అని గుర్తు చేస్తున్నారు. శివుడికి రాముడు పూజలు చేసిన పవిత్ర పుణ్య స్థలం రామేశ్వరం కావడంతో, రామేశ్వరం నుండి అయోధ్యలోని రామాలయానికి చేరుకున్న ఈ గంటకు అంతే పవిత్రత ఉంటుందని చెప్తున్నారు.

రామేశ్వరం నుండి రామ జన్మభూమికి చేరుకున్న ఈ గంటను అయోధ్య వాసులు ఆసక్తిగా చూస్తున్నారు .

English summary
The Ram Rath Yatra, which was started from the holy city of Rameswaram in Tamil Nadu last month, culminated in the temple town of Ayodhya on Wednesday.The Rath brought along a bronze bell emblazoned with “Jai Shri Ram” and weighing around 613 kg along with idols of Lord Ram, Goddess Sita, Lakshaman, Lord Hanuman, and Lord Ganesha for their installation in the grand Ram temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X