వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌లో పోటీ చేయాలి..! రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు!!

|
Google Oneindia TeluguNews

ముంబై : యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోతే ప్రముఖ రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పటిలాగే ట్వీట్లతో దుమ్మురేపారు. కశ్మీర్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురిచేస్తోంది. ఇక వర్మ ట్వీట్‌కు నెటిజన్లు జోరుగా స్పందిస్తున్నారు. కొందరేమో కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే .. మరికొందరు కాస్త సానుభూతి తెలియజేస్తున్నారు. మొత్తానికి చాలారోజుల తర్వాత వర్మ హాట్ కామెంట్స్ చేసి .. సంచలనం సృష్టించారు.

 కశ్మీర్ ఇష్యూ గురించి ..

కశ్మీర్ ఇష్యూ గురించి ..

జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. మోడీ సర్కార్ విధానాలను ఎండగడుతుంది. అటు పాకిస్థాన్ కూడా ఇలాగే వ్యవహరించడంతో సీన్‌లోకి రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొలుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మోడీ హవాకు కాంగ్రెస్ పార్టీ తట్టుకునే పరిస్థితి లేదని పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజలు ఆ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని తెలిపారు.

ఉచిత సలహా

ఉచిత సలహా

పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీకి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దేశంలో ఆ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున .. మరో దేశం చూసుకోవాలని కోరారు. కశ్మీర్‌పై పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకేలా ఉన్నందున ఇకపై అక్కడ పోటీచేయాలని సూచించారు. దీంతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతేకాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తన సలహా సూచనను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తేరుకొని .. భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో పోటీచేయాలని కోరారు. చివరగా ఇది కేవలం సూచన మాత్రమేనని ముక్తాయించారు. తన సలహా, సూచనలను తూ.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదనే ఇండికేషన్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు రాం గోపాల్ వర్మ.

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

వర్మ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. వివాదాస్పద సినిమాలు తీయడం, ట్వీట్లు చేయడం ఆయనకే చెల్లింది. అంతేకాదు తన సినిమా ప్రమోషన్‌ను మీడియాతో ఎలా చేసుకోవాలో కూడా పక్కాగా తెలుసు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం వివాదాస్పదమైంది. ఈ సినిమా రిలీజ్‌పై కోర్టుకు వెళ్లడంతో ఏపీలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తెలుగు తమ్ముళ్లు .. వర్మ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరింది కూడా.

English summary
Seeing the congress party stand on Jammu Kashmir issue I think they should contest in pakistan and will surely win Is it because the congress party realised that their time is over in india that they are planning to shift to pakistan ? Just asking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X