పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే, ఎపికి ప్రత్యేక హోదా: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కె. రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. సోమవారం ఉదయం లోక్‌సభలో ఆ విషయంపై మాట్లాడారు. విభజన చట్టంలో చెప్పిన విధంగా 15 సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు.
ప్రత్యేక హోదా విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి విన్నవించారన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని అంటూ ఏపీకి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని ఎంపీ రమ్మోహన్‌నాయుడు కేంద్రాన్ని కోరారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన నిర్వహించారు. సహారా కుంభకోణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. సహారా కుంభకోణం విచారణలో ఒక డైరీ దొరికిందని, అందులో అమిత్ షా పేరు ఉందని ఎంపీలు ఆరోపించారు.
సహారా స్కాంలో అమిత్‌షా ప్రమేయంపై దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.ఆదివారం కోల్‌కత్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా శారదా చిట్స్ స్కామ్‌లోనూ, బర్దన్ పేలుళ్ల ఘటనలోనూ తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని ఆయన ఆరోపించిన విషయం విధితమే. దానికి జవాబుగా అన్నట్లు టీఎంసీ ఎంపీలు సోమవారం అమిత్‌షాను లక్ష్యం చేసుకున్నారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications