వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రదకు నాన్-బెయిలబుల్ వారంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఘటనలో..

|
Google Oneindia TeluguNews

బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారంట్ జారీచేసింది. ఈ కేసు తదుపర విచారణ ఏప్రిల్ 30వ తేదీన చేపడుతామని ధర్మాసనం శనివారం తెలిపింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ బీజేపీ అభ్యర్థిగా జయప్రద బరిలోకి దిగారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని కేసు నమోదైంది. దీనిని రాంపూర్ కోర్టు శనివారం విచారణ చేపట్టింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదైందని తెలిపింది. తదుపరి విచారణను వచ్చేనెల 20వ తేదీకి వాయిదావేసింది.

rampur court issues non-bailable warrant to actress jayaprada

Recommended Video

Yes Bank Crisis Hit PhonePe Know Why ? | Oneindia Telugu

గత ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఓడిపోయిన జయప్రద.. అంతకుముందు రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున పోటీచేసి గెలుపొందారు. కానీ ఎస్పీ నుంచి అమర్ సింగ్ తప్పుకోవడంతో.. ఆమె కూడా పార్టీకి దూరమవుతూ వచ్చారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి.. బరిలోకి దిగారు.

ఎన్నికల సందర్భంగా జయప్రదపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. జయప్రదపై చేసిన కామెంట్లకు గానూ.. ఈసీ ఆజంఖాన్ ప్రచారంపై కొద్దిరోజులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ ఓటర్లు మాత్రం ఆజాంఖాన్‌కే పట్టం కట్టారు.

English summary
rampur court issues non-bailable warrant to actress jayaprada on model code of conduct issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X