వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు సినిమా చూపిస్తున్న రెబల్ స్టార్, నటి రమ్యా: ఏం జరుగుతోంది ?

కర్ణాటకలోని నంజనగూడు, గుండ్లుపేట శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల ప్రచారానికి రెబల్ స్టార్ అంబరీష్, మాజీ ఎంపి, బహుబాష నటి రమ్యా దూరంగా ఉంటూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సినిమా .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో ఉప ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సొంత పార్టీకి చెందిన సినీ నటులు చుక్కలు చూపిస్తున్నారు. కర్ణాటకలోని నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ నేతలు ప్రచారం చూస్తూ దూసుకుపోతున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం తూతూమంత్రంగా ప్రచారం చెయ్యడంతో పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు విసిగిపోతున్నారు.

రెబల్ స్టార్ ఎక్కడ ?

రెబల్ స్టార్ ఎక్కడ ?

కర్ణాటక మాజీ మంత్రి, రెబల్ స్టార్ అంబరీష్ మాయం అయ్యారు. మండ్య జిల్లాకు చెందిన అంబరీష్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన నంజనగూడు, గుండ్లు పేట నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి వస్తారా ? లేదా ? అంటూ ఆయన అభిమానులు పెద్దఎత్తున చర్చ మొదలు పెట్టారు.

గురువు బాటలోనే నటి రమ్యా ?

గురువు బాటలోనే నటి రమ్యా ?

మండ్య మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా కూడా నంజనగూడు, గుండ్లుపేట నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యారు. అసలు ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తన రాజకీయ గురువు ఎస్ఎం, కృష్ణ బీజేపీలో చేరడం, మరో గురువు అంబరీష్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరం కావడంతో అదే బాటలో రమ్యా కూడా వెలుతున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

బీజేపీలోకి రెబల్ స్టార్ అంబరీష్, సుమలత దంపతులు ?

బీజేపీలోకి రెబల్ స్టార్ అంబరీష్, సుమలత దంపతులు ?

గత మంత్రి వర్గ విస్తరణ సమయంలో అంబరీష్ ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయనకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తప్పించడంతో సీఎం సిద్దరామయ్య మీద అంబరీష్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి అంబరీష్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రెబల్ స్టార్ అంబరీష్, తెలుగింటి ఆడపడుచు సుమలత దంపతులు త్వరలో బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సిద్దూ ఏం చేస్తారు, అసహనంతో అభ్యర్థులు

సిద్దూ ఏం చేస్తారు, అసహనంతో అభ్యర్థులు

12 సంవత్సరాల క్రితం జేడీఎస్ పార్టీలో ఉన్న సిద్దరామయ్యను అనూహ్యంగా సీఎం పదవి నుంచి తప్పించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దరామయ్యను ఉప ఎన్నికల్లో గెలిపించడానికి అంబరీష్ శక్తి వంచనలేకుండా పని చేశారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన రెబల్ స్టార్ అంబరీష్ ఆ వర్గం ఓట్లు సిద్దరామయ్యకు వచ్చే విధంగా అప్పట్లో ముమ్మరంగా ప్రచారం చేశారు.

మైసూరు, మండ్యలో అదే గతి

మైసూరు, మండ్యలో అదే గతి

ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం, కృష్ణ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన అంబరీష్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే మండ్య, మైసూరు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆపార్టీ ఎమ్మెల్సీ, బహుబాష నటి తార, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి సదానందగౌడ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

English summary
Former member of parliament and cinema actress Ramya and former minister and actor Ambareesh missing in Congress campaigners list in Nanjagud by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X