వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో ఢీ, మోడీకి గుజరాత్ చేదు: రాహుల్ గాంధీ వెనుక నటి రమ్య

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. ఐదు పర్యాయాలు అధికారంలో ఉన్న కమలం పార్టీకి తోడు సొంత రాష్ట్రానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ జోరు కనిపించింది.

అన్నేళ్లు పాలించిన బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండాలి. కానీ అది కనిపించలేదు. అది కమలం పార్టీ సమర్థత. అలాగే కాంగ్రెస్ పార్టీకు కుల సంఘాల నాయకులు జత కలిశారు. దీంతో బీజేపీ మెజార్టీ తగ్గింది. మొత్తానికి కాంగ్రెస్ మాత్రం బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది.

బీజేపీని-మోడీని ఢీకొట్టగలరా: రమ్య రాకతో మారిన సీన్! ఆమె ముందు సవాళ్లుబీజేపీని-మోడీని ఢీకొట్టగలరా: రమ్య రాకతో మారిన సీన్! ఆమె ముందు సవాళ్లు

బీజేపీ ఓడినంత పని కనిపించింది

బీజేపీ ఓడినంత పని కనిపించింది

బీజేపీ గెలిచినప్పటికీ ఫలితాల లెక్కింపు సమయంలో ఓడినంత పని కనిపించింది. ప్రధాని మోడీకి ఈ గెలుపు ఓ గెలుపే కాదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉండటం, పటిదార్ల ఉద్యమం, ఓబీసీ, దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని మరిచిపోతున్నారు.

Recommended Video

BJP Vs Congress : యువతను ఆకర్షించే పనిలో మాజీ ఎంపి, నటి రమ్య
రాహుల్ గాంధీకి అండగా

రాహుల్ గాంధీకి అండగా

లెక్కింపు సమయంలో ఓ దశలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, బీజేపీ వెనుకబడుతుందని తెలిసి స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. అలాంటి గట్టి పోటీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ గట్టి పోటీనివ్వడం వెనుక కుల సంఘాల నాయకులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా రాహుల్ గాంధీకి అండగా నిలిచారు.

సోషల్ మీడియా పాత్ర

సోషల్ మీడియా పాత్ర

గుజరాత్‌లో కాంగ్రెస్ గతంలో కంటే మంచి ఓట్లు, సీట్లు సాధించడం వెనుక సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. సోషల్ మీడియాను మాండ్య మాజీ ఎంపీ, నటి రమ్య (దివ్య స్పందన) చూస్తున్నారు. సోషల్ మీడియా ఆమె చేతికి వచ్చాక బీజేపీకి ధీటుగా ముందుకు తీసుకు వెళ్తున్నారు.

సోషల్ మీడియా అస్త్రంగా రమ్య

సోషల్ మీడియా అస్త్రంగా రమ్య

రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితమే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రమ్యకు సోషల్ మీడియా పగ్గాలు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. రాహుల్ ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 2014లో ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. రమ్య కూడా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రమ్య అండ్ కో సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకున్నారు.

అభివృద్ధి అంతా వట్టిదే

అభివృద్ధి అంతా వట్టిదే

గుజరాత్‌లో, దేశంలో బీజేపీ చెబుతున్న అభివృద్ధి, వికాస్ అంతా ఉత్తిదే అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలం చెప్పుకోవడం తప్ప అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రమ్య సోషల్ మీడియా పగ్గాలు చేపట్టాక బీజేపీ సోషల్ మీడియాకు ధీటుగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేసింది.

English summary
Ramya's effort to establish Rahul Gandhi, congress ahead of BJP in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X