వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయిక రంజాన్
న్యూఢిల్లీ: ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానావాళికి మంచిని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
ముస్లింలు చాంద్రమాన కేలండరును అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసవ్రతం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అంటారు.