వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు ఖురాన్లు పంచు.. యువతికి రాంచీ కోర్టు శిక్ష

|
Google Oneindia TeluguNews

రాంచీ : కుల, మతాలను కించపరుచడం నేరం. సోషల్ మీడియా మహాత్యంతో యువత అందరినీ విమర్శిస్తుంది. ఇదే విధంగా రాంచీకి చెందిన ఓ యువతి కూడా మతపరమైన పోస్ట్ చేసింది. దీంతో ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందు, ముస్లింల ఘర్షణ వాతావరణంతో ఎస్పీ జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Ranchi court directs teen to distribute 5 Qurans

పోస్ట్ తెచ్చిన తంటా..?
రాంచీకి చెందిన రిచాభారతి అనే విద్యార్థిని శనివారం మతపరమైన పోస్ట్ చేశారు. దీనిని ఆ వర్గం ప్రతినిధులు తప్పుపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల ఫిర్యాదుతో రిచాభారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితు యువతి అరెస్ట్‌ను హిందూ సంస్థలు తప్పుపట్టాయి. నిరసన ప్రదర్శన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రూరల్ ఎస్పీ అశుతోస్ శేఖర్ జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి .. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే రిచాభారతి కేసును రాంచీ కోర్టు విచారించింది. మతపరమైన పోస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కుల, మతాల గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని స్పష్టంచేసింది. ముస్లింలను కించపరిచినందుకు .. 5 కాపీల ఖురాన్ పంచాలని తీర్పునిచ్చింది. ఇందులో ఒకటి అంజుమన్ ఇస్లామియా కమిటీకి, మిగిలిన 4 కాపీలు పాఠశాలలు, కాలేజీ లైబ్రరీకి అందజేయాలని మేజిస్ట్రేట్ మనీశ్ కుమార్ ఆదేశించారు. ఇరువర్గాల సమ్మతితో రిచాభారతీకి బెయిల్ మంజూరు చేశారు.

English summary
A 19-year-old girl has been asked by a Ranchi court to distribute five copies of Quran as a punishment for posting a communal post on social media. Judicial Magistrate Manish Kumar directed Richa Bharti to donate a copy of the holy book to Anjuman Islamia Committee and rest four to the libraries of different schools and colleges. Richa Bharti, who is a first year student at a local college, was arrested on Saturday night after a case was registered against her for allegedly sharing objectionable communal content that hurt the sentiments of a minority community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X