వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజన్ గొగొయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం క్విడ్ ప్రోకోనే: అసదుద్దీన్ విమర్శలు, సిద్దరామయ్య కూడా..

|
Google Oneindia TeluguNews

మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడంపై వివాదం రాజుకుంది. గొగొయే ఎగువసభకు నామినేట్ చేయడంలో క్విడ్ ప్రోకో జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తొలుత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు చేశారు. గొగొయ్‌ను నియమించడంపై న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యంపై ప్రభావం చూపనుందా అని ప్రశ్నించారు.

స్వాతంత్యంగా పనిచేసిన జడ్జీలను ఎలా నామినేట్ చేస్తారని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. దీంతో పలు ప్రశ్నలు సగటు మనిషి మెదడును తొలచివేస్తోందని పేర్కొన్నారు. గొగొయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంతో క్విడ్ ప్రోకో జరిగిందా అని అనుమానం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ మాదిరిగానే మాజీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా మండిపడ్డారు. గొగొయ్‌ను రాజ్యసభకు పంపించి దేశ ప్రజలు, భావి సుప్రీంకోర్టు సీజేఐలకు రాష్ట్రపతి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు రాజీపడి పనిచేయొద్దని.. అలా అయితే నిర్వీర్యం అవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ నుంచి రంజన్ గొగొయ్ విరమణ చెందారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 13 నెలలు పనిచేశారు. అయితే సీజేఐగా పనిచేసిన గొగొయ్.. రాజ్యసభ సభ్యుడిగా నియమించిన తొలి వ్యక్తిగా నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభకు వెళ్లారు. కానీ ఆయన డైరెక్ట్‌ నామినేట్ కాకుండా.. కాంగ్రెస్ పార్టీ నుంచి నియమితులయ్యారు.

Recommended Video

Sharad Arvind Bobde Takes Oath As 47th CJI || Oneindia Telugu
Ranjan Gogoi Nominated to the Rajya Sabha; Quid Pro Quo: Opposition


గొగొయ్ 13 నెలల కాలంలో కీలక తీర్పులు వెలువడించారు. అయోధ్య వివాదాస్పద భూమి, రాఫెల్ డీల్, శబరిమల ఆలయ ప్రవేశ దర్శన వివాదంపై తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కూడా రాజ్యసభకు నామినేట్ అయి... వార్తల్లో నిలిచారు.

English summary
Former Chief Justice of India Ranjan Gogoi nominate to rajyasabha is Quid Pro Quo AIMIM leader Asaduddin Owaisi alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X