వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడోదర: బీజేపీ అభ్యర్దిగా రంజన్‌బెన్ భట్టా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ నియోజవర్గమైన వడోదర స్దానానికి బీజేపీ తమ అభ్యర్దిగా రంజన్‌బెన్ భట్టా పేరును ఖరారు చేసింది. వారణాసి, వడోదర రెండు స్దానాల నుండి గెలిచిన.. నరేంద్ర మోడీ రాజీనామా చేయడంతో వడోదర స్దానం ఖాళీ అయింది.

దీంతో వడోదర స్దానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం రంజన్‌బెన్ భట్టా పేరు ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రంలో ఉప ఎన్నిక సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది. నామినేషన్ వేయడానికి బుధవారం చివరి రోజు.

Ranjanben Bhatta is BJP’s candidate in Vadodara

కాంగ్రెస్ తరుపున నరేంద్ర రావత్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఈ పార్లమెంట్ నియోజక వర్గం నుండి 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వడోదర స్దానానికి బీజేపీ అభ్యర్దిగా హైకమాండా తన పేరుని ప్రకటించడంతో రంజన్‌బెన్ భట్టా హర్షం వ్యక్తం చేశాడు.

వడోదర మున్సిపల్ కార్పోరేషన్‌కి జూన్‌లో డిప్యూటీ మేయర్‌గా రంజన్‌బెన్ భట్టా నియమితులయ్యారు. వడోదర మున్సిపాలిటీలో నాలుగు సార్లు కార్పోరేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అదే విధంగా గుజరాత్‌లో జరగనున్న 9 స్దానాలకు, రాజస్దాన్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 2, చండీఘడ్, సిక్కిం, త్రిపురలో జరగనున్న ఒక్కో స్దానానికి తమ అభ్యర్దులను ప్రకటించింది.

భాజపాపై శివసేన విసుర్లు

శివసేన పత్రిక తన సంపాదకీయంలో భాజపాపై కొన్ని విమర్శలు చేసింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాజపాకు దక్కిన సీట్లపై విశ్లేషిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనంపై ఆధారపడకూడదని పేర్కొంది.

English summary

 The Bhartiya Janata Party on Tuesday announced the name of Ranjanben Bhatta as its candidate for the by-election to the Vadodara Lok Sabha seat in Gujarat. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X