వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రంజిత సన్యాసం: మా ఆనందమయి అవతారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha - Nityananda
బెంగళూర్: వివాదాస్పద నటి రంజిత సన్యాసం స్వీకరించారు. 38 ఏళ్ల రంజిత శుక్రవారంనాడు నిత్యానంద ఆశ్రమంలో సన్యాసినిగా ప్రతిజ్ఞ చేశారు. స్వామి నిత్యానంద జన్మదిన వేడుకల సందర్భంగా ఇటువంటి ప్రతిజ్ఞ తీసుకోవడం సంప్రదాంయ. రంజిత తన పేరును కూడా మార్చుకుంది. మా ఆనందమయిగా తన పేరు మార్చుకుంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

గత నాలుగేళ్లుగా ఆమె స్వామి నిత్యానంద వద్ద శిష్యరికం చేస్తున్నారు. స్వామి నిత్యానందతో రంజిత శారీరక సంబంధం పెట్టుకుందంటూ విడుదలైన వీడియోలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అది మార్ఫింగ్ చేసిన వీడియోగా తర్వాత తేలింది.

వీడియో విడుదలైన తర్వాత కూడా ఆమె ఆశ్రమంలో పలు మత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంజితకు ఆశ్రమం విదేశీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి శేష జీవితం ఆమె ఆశ్రమంలోనే గడుపుతారని అంటున్నారు.

సన్యాసిని ఆర్హతలు రంజితకు లేవని నాగనూరు మఠం బసవ గీత మాత అంటున్నారు. సన్యాసి కావడం సాధనతో కూడిందని ఆమె అన్నారు. ఆడంబరమైన జీవితం గడిపినవారు రాత్రికి రాత్రి సన్యాసులు కావడం అసాధ్యమని అన్నారు. దానికి ధ్యానం, మత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు.

English summary
According to media reports - In a surprising move, Tamil actress Ranjitha (38) on Friday December 27 took vows to become a hermitess (Sanyasini) at Nityananda ashram, during a programme to celebrate the birthday of Swamy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X