వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

వారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టేందుకు రిమాండ్‌కు ఇవ్వమని పోలీసులు కోరడంతో .. 14 రోజుల రిమాండ్ ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ..ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ..

Recommended Video

కమలం గూటికి అరకు మాజీ ఎంపీ

లైంగికదాడి ..
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ విద్యార్థిని రాయ్‌పై ఫిర్యాదు చేసింది. తనపై లైంగికదాడి చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోసి లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరఫున అతుల్ రాయ్ బరిలోకి దిగాడు. అయితే లైంగికదాడి కేసు రిజిస్టర్ అవ్వడంతో అప్పటినుంచి ఆజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల పోలీసులు కోర్టును ఆశ్రయించారు. రాయ్ ఆస్తి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో తాను వారణాసి కోర్టులో లొంగిపోతానని రాయ్ తెలిపాడు. చెప్పినట్టే ఇవాళ కోర్టు ముందుకొచ్చాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకొని .. కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు అభ్యర్థన మేరకు 14 రోజుల రిమాండ్‌కు ఇచ్చారు. రాయ్ కోర్టుకు వచ్చే సమయంలో అతని మద్దతుదారులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతనికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Rape accused BSP MP Atul Rai surrenders, gets 14-day remand

అభ్యర్థిని మార్చని వైనం ...
తమ అభ్యర్థిపై ఆరోపణలు వచ్చిన బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం వెనుకడుగు వేయలేదు. గోస్ నియోజకవర్గం నుంచి రాయ్ పోటీ చేస్తారని స్పస్టంచేశారు. రాయ్ కోసం ప్రచారం చేయాలని శ్రేణులను కోరారు. స్వయంగా మాయావతి కూడా ప్రచారం చేశారు. అనుకున్నట్టే ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు .. కానీ బయటకు రాలేదు. ఎంపీలు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసినా .. రాయ్ మాత్రం ఆజ్ఞాతంలోనే ఉన్నారు. తాజాగా పోలీసులు ఆస్తి స్వాధీనం చేసుకుంటామని కోర్టుకెళ్లడంతో .. లొంగిపోతానని చెప్పాడు.

English summary
Newly elected BSP MP Atul Rai, who had been accused of rape, evaded arrest and surrendered in a Varanasi court on Saturday. He was sent to a jail on 14 days judicial remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X