• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్రీ బోర్డర్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. ఆస్పత్రిలో ఆమె చివరి మాటలివే అంటూ తండ్రి ఆవేదన...

|

ఢిల్లీ శివారులోని టిక్రీ బోర్డర్ వద్ద రైతుల ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువతి గ్యాంగ్ రేప్‌కి గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యాచార ఘటన తర్వాత ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలగా... ఈ నెల 30న మృతి చెందారు. తనతో మాట్లాడిన మాటలే చివరిసారి అని... తనకు న్యాయం జరగాల్సిందేనని తన కూతురు వాపోయిందని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. అదే సమయంలో తనపై జరిగిన అత్యాచార ఘటనను రైతుల ఆందోళనకు ముడిపెట్టి ఎక్కడ బద్నాం చేసే ప్రయత్నం చేస్తారోనని ఆమె ఆందోళన చెందినట్లు తెలిపారు.

26 ఏళ్ల బెంగాల్ యువతిపై గ్యాంగ్ రేప్...

26 ఏళ్ల బెంగాల్ యువతిపై గ్యాంగ్ రేప్...


26 ఏళ్ల ఆ బెంగాల్ యువతి రైతుల ఆందోళనల్లో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితం టిక్రీ బోర్డర్‌‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా... అప్పటికే ఆమె కరోనా బారినపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ నెల 30న ఆస్పత్రిలో మృతి చెందారు. రైతులు ఆందోళన చేస్తున్న టిక్రీ బోర్డర్‌లో యువతిపై అత్యాచారం జరగడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమంలో పాల్గొంటున్న సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు.

బాధితురాలి తండ్రి ఆవేదన...

బాధితురాలి తండ్రి ఆవేదన...

యువతిపై జరిగిన అఘాయిత్యం గురించి సంయుక్త కిసాన్ మోర్చాకు తెలియదని యోగేంద్ర యాదవ్ తెలిపారు. అయితే ఒకరిద్దరు రైతు నేతలకు ఈ ఘటన గురించి తెలిసినట్లు వార్తలు వస్తున్నాయని... దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఇదే ప్రెస్‌మీట్‌లో బాధితురాలి తండ్రి కూడా మాట్లాడారు. 'రైతు ఆందోళనల్లో పాల్గొనాలని నా కూతురు చాలా పట్టుదలతో ఉండేది. బెంగాల్ నుంచి టిక్రీకి బయలుదేరిన ఆమె కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరిందని తెలిశాక అక్కడికి వెళ్లి కలిశాను. నిజానికి ఆమెపై అత్యాచారం జరిగిందని తెలిసి ఉంటే... అంతకన్నా ముందే ఆమెను కలిసి ఉండేవాడిని..' అంటూ బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ఉద్యమాన్ని బద్నాం చేయొద్దని...

రైతు ఉద్యమాన్ని బద్నాం చేయొద్దని...

ఆస్పత్రిలో తన కూతురిని కలిసినప్పుడు తనకు న్యాయం జరగాల్సిందేనని ఆమె చెప్పిందని.. అవే ఆమె చివరి మాటలని తండ్రి పేర్కొన్నారు. అంతేకాదు,ఈ ఘటనను అడ్డం పెట్టుకుని రైతు ఉద్యమంపై బురదజల్లే ప్రయత్నం జరగవద్దని ఆమె వాపోయినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన నాలుగు రోజులకు ఆమె మృతి చెందినట్లు చెప్పారు. తాజా ఘటనతో టిక్రీ బోర్డర్‌లో మహిళల రక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉగ్రహాన్ సింగ్ స్పందిస్తూ... రైతుల కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశామని,రాత్రి వేళల్లో కాపలా కూడా కాస్తున్నామని చెప్పారు. ఇకపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామన్నారు.

  Telangana : ధాన్యం కొనుగోలు సెక్టార్లని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు!!
  కేసు నమోదు... కొనసాగుతున్న దర్యాప్తు...

  కేసు నమోదు... కొనసాగుతున్న దర్యాప్తు...

  బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు హర్యానాలోని బహదూర్‌ఘర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనూప్,అనిల్ మాలిక్ అనే ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశారు. వీరితో మరో నలుగురు నిందితుల పేర్లు కూడా చేర్చినట్లు తెలుస్తోంది. అనూప్,అనిల్ మాలిక్ అనే ఇద్దరు రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి నేత్రుత్వంలో నడుస్తున్న కిసాన్ సోషల్ ఆర్మీని సంయుక్త కిసాన్ మోర్చా బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన టెంట్లు,శిబిరాలను టిక్రీ బోర్డర్‌ నుంచి తొలగించినట్లు కథనాలు వస్తున్నాయి.

  English summary
  Activist Yogendra Yadav, who is currently linked with the farmers' agitation, on Monday dismissed reports that Samyukta Kisan Morcha leaders were aware of the sexual assault on a female protester at the Tikri border protest site.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X