• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఓలా క్యాబ్‌లో దారుణం.. విదేశీ యువతిని నగ్నంగా చేసి లైంగిక దాడి, కామాంధులు, డ్రైవర్, ఫ్రెండ్స్!

|

బెంగళూరు: చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వచ్చిన విదేశీ మహిళ (25)పై లైంగిక దాడి చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ అతని స్నేహితులు ఆమెను నిలువు దోపిడీ చేశారు. కారులో బెంగళూరు నగర శివార్లలో ఆమెను మరుసటి రోజు వరకు కారులో తిప్పి లైంగిక దాడి చేసి శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా చేసి వాహనంలో నుంచి చీకట్లో కిందకు తోసేసి పరారైనారు. ఫాం హౌస్ లో నివాసం ఉంటున్న వారి సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఓలా క్యాబ్ డ్రైవర్ తో సహ అతని స్నేహితులైన కామాంధుల అరచకాలు వెలుగు చూశాయి.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

క్యాన్సర్ చికిత్స కోసం!

క్యాన్సర్ చికిత్స కోసం!

తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాకు చెందిన 25 ఏళ్ల యువతి ఇటీవల ఢిల్లీ చేరుకుని క్యాన్సర్ చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వచ్చింది. బెంగళూరు నగరంలోని కమ్మనహళ్ళిలోని సిటిలైన్ ఆసుపత్రిలో ఆమె క్యాన్సర్ చికిత్స చేయించుకుంటోంది.

రాత్రి ఓలా క్యాబ్ బుక్ చేస్తే!

రాత్రి ఓలా క్యాబ్ బుక్ చేస్తే!

జనవరి 16వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో కమ్మనహళ్ళిలోని సిటీలైన్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన విదేశీ యువతి బెంగళూరులోనే నివాసం ఉంటున్న స్నేహితుల ఇంటికి వెళ్లడానికి ఓలా క్యాబ్ బుక్ చేసింది. రాత్రి విదేశీ యువతి ఉన్న ప్రాంతానికి ఓలా క్యాబ్ వచ్చింది.

కారులో కామాంధులు

కారులో కామాంధులు

రాత్రి ఆసుపత్రి దగ్గరకు వచ్చిన ఓలా క్యాబ్ లో యువతి ఎక్కింది. తరువాత సాటి ప్రయాణికులు లాగా నటించిన ఓలా క్యాబ్ డ్రైవర్ ఇద్దరు స్నేహితులు అదే కారులో కుర్చున్నారు. కారు బయలుదేరిన తరువాత ఓలా డ్రైవర్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులు యువతి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. కేకలు వేస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించి ఆమెను శారీరకంగా హింసించి కామవాంఛ తీర్చుకున్నారు.

 విదేశీ యువతిని నగ్నంగా చేసి!

విదేశీ యువతిని నగ్నంగా చేసి!

కత్తులతో బెదిరించి విదేశీ యువతిని కారులో నగ్నం చేసిన కామాంధులు మరుసటి రోజు జనవరి 17వ తేదీ ఉదయం 4.15 గంటల వరకు ఆమె మీద విరుచుకుపడి కామంతో రెచ్చిపోయారు. మాకు లైంగిక కోరికలు తీర్చాలని యువతిని బెదిరించారు. ఆ సమయంలో యువతి అందుకు అంగీకరించకపోవడంతో నిందితులు ఆమెను శారీరకంగా హింసించి రెచ్చిపోయారు.

చీకట్లో కారులో నుంచి తోసేసి!

చీకట్లో కారులో నుంచి తోసేసి!

విదేశీ యువతి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, పర్స్, నగదు లాక్కొన్నారు. యువతి రోడ్డు గుర్తు పట్టకుండా బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం పరిసర ప్రాంతాల్లో తిప్పారు. నగ్నంగా ఉన్న యువతి మీద కనికరం కూడా లేకుండా రోడ్డు పక్కన చీకటిలో ఆమెను కారులో నుంచి కిందకు తోసేసిన కామాంధులు అక్కడి నుంచి పరారైనారు.

 ఫాం హౌస్ లోకి పరుగు

ఫాం హౌస్ లోకి పరుగు

నగ్నంగా ఉన్న యువతి ఏం చెయ్యాలో అర్థంకాక రోడ్డు పక్కన ఉన్న ఫాం హౌస్ దగ్గరకు చీకట్లో పరుగు తీసింది. తనకు సహాయం చెయ్యాలని యువతి ఆర్తనాదాలు చేసింది. ఫాం హౌస్ లో నివాసం ఉంటున్న వారు నిద్రలేచి నగ్నంగా ఉన్న యువతిని చూసి షాక్ కు గురైనారు. యువతికి బట్టలు ఇచ్చిన ఫాం హౌస్ నివాసులు దోడ్డబళ్లాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా ఓలా క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ తెలిపారు.

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కు చేదు అనుభవం

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కు చేదు అనుభవం

ఇటీవల లండన్ వెళ్లిన బాలీవుడ్ నటి సోనం కపూర్ ను ఉబెర్ క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయంపై విచారం వ్యక్తం చేసిన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ట్వీట్టర్ లో తన భాదను పంచుకుంది. ఒంటరిగా ప్రయాణం చెయ్యాలని అనేకునే మహిళలు ఉబెర్, ఓలా క్యాబ్ లను బుక్ చేసుకోరాదని, స్థానికంగా సంచరించే ట్యాక్సీలలో ప్రయాణం చెయ్యాలని మనవి చేసింది. బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో కొందరు ఓలా క్యాబ్, ఉబెర్ ట్యాక్సీల డ్రైవర్లు మహిళలు, యువతుల మీద లైంగిక దాడికి పాల్పడ్డారని, దౌర్జన్యం చేశారని అనేక సార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

English summary
Rape attempt On Foreign Lady In Bengaluru By Ola Driver. A complaint lodged about this in Doddaballapura Police Station. Ola driver and 2 others are escaped. Police investigation going On By Bengaluru Rural Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X