వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..

ఒక బాబా కోసం లక్షల మంది జనం రోడ్ల మీదకు రావడం దేశం మొత్తాన్నే ఆశ్చర్యపరుస్తోంది. తిండి తిప్పలు మానేసి అతని కోసం ఎదురుచూపులు.. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రతిఘటించడానికి మారణాయుధాలతో కాపలాలు.. ఇదంతా ఏ బాబ

|
Google Oneindia TeluguNews

చంఢీగఢ్: ఒక బాబా కోసం లక్షల మంది జనం రోడ్ల మీదకు రావడం దేశం మొత్తాన్నే ఆశ్చర్యపరుస్తోంది. తిండి తిప్పలు మానేసి అతని కోసం ఎదురుచూపులు.. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రతిఘటించడానికి మారణాయుధాలతో కాపలాలు.. ఇదంతా ఏ బాబా విషయంలోను మునుపెన్నడూ చూడని ప్రతిస్పందన.

డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులుడేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను చూసి దేశమే నివ్వెరపోతున్న పరిస్థితి. రేప్ కేసులో అతనో దోషి అని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. జనం మాత్రం ఆయనంతలా ఎందుకు అభిమానిస్తున్నారు?.. ఇదే ఇప్పుడు చాలామందిలోను మెదులుతోన్న ప్రశ్న. దీనికి కారణం తెలుసుకోవాలంటే కాస్త లోతుగా చర్చించాల్సిందే.

మధ్య యుగాల నుంచి డేరాలు:

మధ్య యుగాల నుంచి డేరాలు:

పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ డేరాలు వెనుకబడిన వర్గాల వారిని అక్కున చేర్చుకున్నాయి. వారి సంక్షేమానికి భరోసానిచ్చాయి. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించాయి. మధ్య యుగాల కాలంలో ఉత్తరభారతంలో ఈ డేరాలు ఏర్పాడ్డాయి.

Recommended Video

Baba Gurmeet Ram Rahim Singh Have Millions of Followers For This Reason....
కులాల గోడలుండవు:

కులాల గోడలుండవు:

డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు తొలిసారిగా నెలకొల్పాడు. ఆయన బోధనలకు ఆకర్షితులైన లక్షలాది మంది ప్రజలు డేరాల్లో చేరారు. ఇక్కడ ఎలాంటి కుల వివక్ష వెంటాడకపోవడం వారికి సంతోషాన్నిచ్చింది. దీంతో డేరాల్లో చేరేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.

ప్రార్థనల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే నామ్ చర్చా ఘర్ లలో పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరిని సమానంగానే చూస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, సహజంగానే దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఇందులో అధిక సంఖ్యలో చేరారు.

సంక్షేమానికి భరోసా:

సంక్షేమానికి భరోసా:


డేరా సచ్చాసౌదాను కొన్ని యూనిట్లుగా విభజించారు. డేరా సచ్చాసౌదాలో భంగీదాస్‌ గా పరగణించబడే వ్యక్తి ఈ యూనిట్లను పర్యవేక్షిస్తుంటాడు. ఒక్కో యూనిట్ కు ఒక్కో భంగీదాస్ ఉంటారు. డేరా సభ్యుల కష్ట, నష్టాలను పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియజేయడం ఇతని విధి. అలా అతని నుంచి వచ్చే వైద్య, ఇతరత్ర ఫిర్యాదులపై ట్రస్ట్ యాజమాన్యం స్పందిస్తుంటుంది. సిర్సాలోని వీరి ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్యం, ఉచిత ఆహారం అందిస్తుంటారు.

ప్రభుత్వ రేషన్ కన్నా మెరుగైన ఆహారం:

ప్రభుత్వ రేషన్ కన్నా మెరుగైన ఆహారం:

డేరాల్లో చేరే సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని ట్రస్ట్ అందిస్తుంటుంది. ఈ ఆహారం ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రేషన్ కన్నా నాణ్యతతో కూడి ఉంటాయి. అన్నింటికిమంచి ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు ఉండదు. ఈ కారణంతోనే డేరాల్లో చేరడానికి ఎక్కువమంది మొగ్గుచూపుతుంటారు.

పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంత వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేస్తుంటారు. ఇవన్ని బలహీన వర్గాలకు అండగా ఉండటంతో డేరా స్వచ్చా సౌదాలో లక్షలాది జనం సభ్యులుగా చేరారు.

 అందుకే అంత ఫాలోయింగ్:

అందుకే అంత ఫాలోయింగ్:

తమ సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న డేరా ట్రస్టు పట్ల అక్కడి ప్రజలు విశ్వాసంతో ఉంటారు. అందుచేతే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారంలో వారు ఎంతకైనా తెగించడానికి వెనుకాడటం లేదు. దేశ చట్టాల కన్నా బాబాకే తాము విధేయులుగా ఉంటామన్న సంకేతాలు పంపిస్తున్నారు.

వీరి తాకిడి తట్టుకోలేకనే అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలని హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు తీర్పు సమయంలో.. మారణాయుధాలు, పెట్రోలు, డీజిల్ వంటి వాటితో గుర్మీత్ భక్తులంతా అక్కడ హల్ చల్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గుర్మీత్ ను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో పరిస్థితులు ఇంకెక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
The rape allegations against Gurmeet Ram Rahim date back to 2002, when a Dera sadhvi wrote an anonymous letter to then Prime Minister Atal Bihari Vajpayee saying she was raped by the Dera chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X