వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారయత్నం చేసిన పోలీస్ ఇన్స్ పెక్టర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగిన మహిళ మీద పోలీస్ ఇన్స్ పెక్టర్ అత్యాచారయత్నం చేసిన సంఘటన తమిళనాడులోని తిరునేల్వి జిల్లాలో జరిగింది. కరండై పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మురగేషన్ (48) అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.

తిరుచ్చిలోని ఇండియన్ బ్యాంకు కాలనీలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఈమె ప్రభుత్వ ఉద్యోగి. భర్తను వదిలి ఒంటరిగా నివాసం ఉంటున్నది. ఆ మహిళతో మురగేషన్ కు చాల కాలం నుండి పరిచయం ఉంది. గతంలో తిరుచ్చి ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో మురగేషన్ పని చేసేవారు.

ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటున్న మురగేషన్ పై అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. ఆ సమయంలో కేసు ఖర్చుల కోసం ఆ మహిళ దగ్గర అప్పుగా రూ. నాలుగు లక్షలు తీసుకున్నాడు. విచారణ పూర్తి అయిన తరువాత మురగేషన్ వేరే విభాగంలో విధులలో చేరాడు.

Rape case Booked against Police Inspector in Tamil Nadu.

ఆ సందర్బంలో ఆ మహిళ తనకు ఇవ్వవలసిన రూ. నాలుగు లక్షలు ఇవ్వాలని అడిగింది. ఆ సందర్బంలో మురగేషన్ నీకు దిక్కున్నచోట చెప్పుకో అని తన మీద దాడి చేశాడని మహిళ నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

నిత్యం పదేపదే మురేగషన్ మీద ఆరోపణలు రావడంతో పలుచోట్లకు బదిలి అయ్యాడు. ప్రస్తుతం కరండై పోలీస్ స్టేషన్ లో విధులలో ఉన్నాడు. ఆ మహిళ మళ్లీ అతనిని డబ్బులు ఇవ్వాలని అడిగింది. శనివారం వేకువ జామున తన ఇంటిలో చోరబడిన మురగేషన్ అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని ఆమెఆరోపించారు.

ఆ సమయంలో తప్పించుకున్న మహిళ అతనిని ఇంటిలో బంధించి బయట తాళం తాళం వేసి తిరుచ్చి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిచెప్పింది. పోలీసులు అక్కడికి వెళ్లే లోపు వెనుక డోర్ తీసుకుని మురగేషన్ పారిపోయాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు.

మురగేషన్ మీద కేసు నమోదు చేశామని మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ షీలా కేసు దర్యాప్తు చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి దగ్గర వివరాలు తెలుసుకున్న మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ షీలా స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. మురగేషన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రామనాథపురంకు చెందిన మురగేషన్ కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

English summary
The police have decided to conduct an enquiry with the inspector, Murugesan, who is now serving in Tirunelveli district, Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X