వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు నెలల్లోనే అత్యాచార కేసుల విచారణ పూర్తి చేయాలి... సీఎంలు, సీజేలకు కేంద్రం లేఖలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో దిశ, యూపీలో ఉన్నావో బాధితురాలి హత్య సంఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పలు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. ఈనేపథ్యంలోనే కేంద్రం సైతం మహిళలపై అత్యాచారాలతో పాటు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఈ కేసులన్నింటీని కేవలం ఆరు నెలల్లోనే విచారణ ముగిసి శిక్షలు పడేలా ... చర్యలు తీసుకుకోవాలని దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాసింది.

మహిళలపై అత్యాచారాలతో పాటు ,చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్రం చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల్లో నిందితులకు శిక్షలు పడడంలో ఆలస్యం అవుతుండడంతో ప్రజలు తక్షణ న్యాయాన్ని కోరుకుంటున్నారు. ఒక్కో కేసుకు సంబంధించి సంవత్సరాల తరబడి విచారణ పేరుతో నిందితులు స్వేచ్చగా తిరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

Rape, POCSO case probes should be completed in 2 months

దీంతో కేంద్ర వైఖరిపై పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రజలు, మేధావులు నిరసన వ్యక్తం చేశారు. దిశ సంఘటనతో కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ప్రధానికి విజ్ఝప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా నిందితులకు శిక్షలు అమలు కాకపోవడం పై ఆయన ప్రశ్నించారు.

ఇక నేరుగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఏకంగా రాష్ట్రపతి కూడ స్పందించారు. దీంతో పోక్సో చట్టంలో శిక్షపడ్డ ఖైదీలకు క్షమాబిక్ష పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో సైతం చర్చించి పున : సమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం సైతం స్పందించింది.

అత్యాచారా కేసుల్లో ఆరునెలల్లోగా నిందితులకు శిక్షలు పడెలా చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఈ తరహా కేసులన్నింటిలో విచారణను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆదేశించారు. కాగా ఆరునెలల్లో శిక్షలు అమలు అయ్యోలా చర్యలు చెపట్టాలని న్యాయమూర్తులను కోరారు.

English summary
Rape, POCSO case probes should be completed in 2 months Law Minister RaviShanker Prasad writes letters to CMs, CJs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X